రిషి సునక్‌కు 10శాతమే విజయావకాశాలు

by Disha Web Desk 16 |
రిషి సునక్‌కు 10శాతమే విజయావకాశాలు
X

లండన్: యూకే ప్రధాని రేసులో ఉన్న భారత సంతతికి చెందిన రిషి సునక్ కు ఓ నివేదిక షాక్ ఇచ్చింది. మరో ప్రధాని అభ్యర్థి లిజ్ ట్రస్, రిషితో పోల్చితే 90 శాతం గెలిచే అవకాశం కలిగి ఉన్నట్లు బెట్టింగ్ ఎక్చేంజి ఫర్మ్ స్మార్కెట్స్ నివేదిక పేర్కొంది. కాగా, ప్రధాని రేసులో అమితూమీ తేల్చేందుకు రిషి, ట్రస్ తుదిపోరుకు మిగిలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరు వారాలు ఎన్నికలకు గడువు ఉండగా, 1,75,000 టోరీ పార్టీ సభ్యుల ఓట్ల కోసం ప్రచారం ప్రారంభించారు. అయితే సునక్ ప్రధాని అయ్యే అవకాశం 10 శాతం మాత్రమేనని స్మార్కెట్ తెలిపింది. అనేక మంది రిషి సునక్‌ను ఉత్తర ప్రచారకుడిగా పేర్కొంటున్నప్పటికీ, ట్రస్ చర్చలలో ప్రదర్శనతో అంచనాలను మించుతున్నట్లు పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, తదుపరి యూకే ప్రధానమంత్రి రేసులో తాను అండర్ డాగ్ అని సునక్ ముందుగా అంగీకరించారు. అయితే ప్రతి ఓటు కోసం పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు. పలు ఆరోపణలతో పదవి నుంచి దిగిపోయిన జాన్సన్ స్థానంలో పోటీకి ముందుగా 11 మంది నిలిచారు. వీరిలో చివరకి ట్రస్, సునక్ మిగిలారు. గత వారం ఓ పోల్ ప్రకారం బీబీసీ టీవీ చర్చలో ట్రస్ బలమైన ప్రదర్శన కనబరిచారని కథనాలు పేర్కొన్నాయి.


Next Story