దళిత బంధుకు ఆ నాయకులు కూడా అర్హులేనా.. ఫొటో వైరల్

by Disha Web |
దళిత బంధుకు ఆ నాయకులు కూడా అర్హులేనా.. ఫొటో వైరల్
X

దిశ, రఘునాథపల్లి : వాట్సప్ వేదికగా దళిత బంధు లబ్ధిదారుల జాబితా తెగ చక్కెర్లు కొడుతుంది. రఘునాథపల్లి మండలానికి 20 యూనిట్లు మంజూరు కాగా 18 మందితో కూడిన ఒక జాబితా వాట్సాప్ గ్రూపులో దర్శనమిచ్చింది. దీన్నిబట్టి మరో రెండు యూనిట్ల లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లోపించిందని జోరుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చక్కర్లు కొడుతున్న జాబితాలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల పేర్లు ఉండడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో గ్రామ సభలు నిర్వహించి బహిరంగంగా అర్హులైన వారిని ఎంపిక చేయాలని నిబంధనలు ఉన్నా.. అధికారులు ఆ నిబంధనను విస్మరించి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల పేర్లతో జాబితాను సిద్ధం చేయడం సరికాదనే విమర్శలు ఉన్నాయి. అయితే, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న జాబితా నిజమైనదేనా..? లేక ఫేక్ జాబితానా..? అనే అనుమానాలు ఉన్నాయి. ఈ జాబితాపై సంబంధిత అధికారి సంతకాలు లేకపోవడంతో ఇది నిజమైన దేనా..? కాదా..? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నాయకులను అప్రదిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా ఆకతాయిలు దీన్ని వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారో ఏమో తెలియదు గానీ.. ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ.. విమర్శనాస్త్రాలు సంధించడం కొసమెరుపుగా మారింది. దీనిపై టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.



Next Story

Most Viewed