నీరవ్ మోదీ సన్నిహితుడిని అరెస్ట్ చేసిన సీబీఐ!

by Disha Web Desk 17 |
నీరవ్ మోదీ సన్నిహితుడిని అరెస్ట్ చేసిన సీబీఐ!
X

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి సన్నిహితుడైన సుభాష్ శంకర్‌ పరబ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో అతన్ని అరెస్ట్ చేసి అక్కడి ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపి భారత్‌కు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. నీరవ్ మోదీకి చెందిన ఫైర్‌స్టార్ కంపెనీలో సుభాష్ శంకర్ ఫైనాన్స్ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా చేశారు. పీఎన్‌బీ నుంచి రూ. 13 వేల కోట్లకు పైగా రుణాలు ఎగ్గొట్టిన ఆరోపణలను నీరవ్ మోదీ ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో సుభాష్ శంకర్ నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో పీఎన్‌బీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ నీరవ్ మోదీతో సహా అతని సోదరుడు నిశాల్ మోదీ, అతని ఉద్యోగి అయిన సుభాష్ శంకర్‌లపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది. 2018లో పీఎన్‌బీ స్కామ్ కేసు నమోదైన నాటి నుంచి సుభాష్ శంకర్ పరారీలో ఉన్నాడు. తాజాగా అతను కైరోలో ఉన్నట్లు తెలుసుకున్న సీబీఐ అరెస్ట్ చేసి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకొచ్చినట్లు సమాచారం.


Next Story

Most Viewed