అటు మిషన్ భగీరథలో నీళ్లు రావు.. ఇటు బోరు మోటర్ కాలిపోయింది

by Dishanational1 |
అటు మిషన్ భగీరథలో నీళ్లు రావు.. ఇటు బోరు మోటర్ కాలిపోయింది
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఎర్రగుంట పల్లె గ్రామంలో తాగునీటిని పంపిణీ చేసే బోరు మోటార్ కాలిపోవడంతో నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలం కావడంతో ఎండలు మండుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి కేవలం రక్షిత తాగునీరు పథకం, బోరు మోటార్ ద్వారా పంపిణీ చేసే నీటి సరఫరా పైనే ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ఎర్రగుంటపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నప్పటికీ ప్రతిరోజు తాగునీరు సరఫరా కావడం లేదని ప్రజలు తెలిపారు. ఎర్రమ్మ గుడి వద్ద ఉన్న తాగునీటి బోరుకు విద్యుత్ మోటార్ ఏర్పాటు చేసి ఆ వీధి కుటుంబాలకు మంచినీటి సరఫరా జరుగుతుంది. ఈ విద్యుత్ మోటార్ కాలిపోవడంతో ప్రజలకు నీటి ఎద్దడి నెలకొంది. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ తోట జనార్దన్ విద్యుత్ మోటార్ రిపేర్ చేసి తాగునీటి సరఫరా జరిగేలా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.



Next Story