జ‌పాన్ రైల్వే టాప్-1 అన‌డానికి ఈ వీడియోనే ఉదాహ‌ర‌ణ‌!

by Disha Web |
జ‌పాన్ రైల్వే టాప్-1 అన‌డానికి ఈ వీడియోనే ఉదాహ‌ర‌ణ‌!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః టెక్నాల‌జీ విషయానికి వస్తే జపాన్ చాలా దేశాల కంటే చాలా ముందుందని ప్రపంచం మొత్తానికి తెలుసు. కాస్త రేటు ఎక్కువైనా ఫ‌ర్వాలేదు కానీ, ట్రెండింగ్ టెక్నాల‌జీ సృష్టించ‌డంలో ఏమాత్రం త‌గ్గేదేలేదు అన్న‌ట్లు ఉంటుంది వీళ్ల ప‌రిస్థితి. ఇక‌, జ‌పాన్ ప్ర‌జా ర‌వాణాలోనూ అంతే దూకుడు క‌నిపిస్తుంది. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసే ప్రజా రవాణా వ్యవస్థ అయిన‌ జ‌పాన్ రైల్వేస్ టాప్‌-1 అని నిరూపించ‌డానికి ఇంట‌ర్నెట్‌లో బోలెడు వీడియోలు క‌నిపిస్తాయి. జపనీస్ రైళ్లు, మెట్రో వ్యవస్థ దేశంలోని నగరాల చుట్టూ ప్రయాణించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి. అయితే, వీటిల్లో ఒసాకా మెట్రో వ్యవస్థ ఖచ్చితంగా అత్యుత్తమమైనదని ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతుంది.

జపాన్‌లోని రైళ్లను ఐదు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి, షింకన్‌సెన్, లిమిటెడ్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్, ర్యాపిడ్, లోకల్. ఇందులో "ఒసాకా, జపాన్" అనే శీర్షికతో ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో క్లిప్ ఒసాకాలోని రైళ్లు రోజువారీ క‌ద‌లిక‌ల‌ను చూపిస్తుంది. అత్యాధునికి టెక్నాల‌జీతో రైళ్లు ట్రాక్‌లపై ప‌రుగులు పెడుతుంటే, రైలు ట్రాక్ కూడా తదనుగుణంగా మారుతుండ‌టం అద్బుతంగా ఉంటుంది. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వీడియోకు లైకులు, కామెంట్లు తెగ వ‌చ్చేస్తున్నాయి.

Next Story