చెస్ట్‌లో నొప్పి వస్తోంది నాన్న.. త్వరగా రా : ఇంటర్ విద్యార్థిని

by Dishanational1 |
చెస్ట్‌లో నొప్పి వస్తోంది నాన్న.. త్వరగా రా : ఇంటర్ విద్యార్థిని
X

దిశ, చిన్నశంకరంపేట: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్ఐ సుభాష్ గౌడ్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల పరిధి కామారం గ్రామానికి చెందిన జూకంటి రాములు కుమార్తె జూకంటి కావేరి(17) ఇంటర్ మొదటి సంవత్సరం చిన్నశంకంపేటలో పూర్తి చేసింది. బుధవారం తన తల్లిదండ్రులు ఉదయం పదిగంటల ప్రాంతంలో పొలం వద్దకు వెళ్లగా ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి తనకు చెస్ట్ పెయిన్ వచ్చింది తొందరగా ఇంటికి రమ్మని తండ్రికి ఫోన్ చేసింది. పొలం వద్ద నుండి తండ్రి ఇంటికి వచ్చే సరికి కావేరి వాంతులు చేసుకుంటూ పడిపోయి ఉంది. వెంటనే కుమార్తెను నార్సింగ్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ చికిత్స చేయించాడు తండ్రి. గురువారం ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని లోటస్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు.


Next Story

Most Viewed