Summer Health Tips : వేసవిలో ఎక్కువగా చల్లటి నీరు తాగొచ్చా..?

by Dishanational2 |
Summer Health Tips : వేసవిలో ఎక్కువగా చల్లటి నీరు తాగొచ్చా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగ భగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది చల్లని నీటి కోసం అల్లాడి పోతుంటారు. ఎప్పుడూ ఫ్రిడ్జ్‌లోని కూల్ వాటర్ తాగుతూ ఉంటారు. అయితే ఎక్కువగా కూల్ వాటర్ తాగితే ఆరోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. అయితే వేసవి కాలంలో ఎక్కువగా కూల్ వాటర్ తాగటం వలన కలిగే, అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • వేసవి కాలంలో ఎక్కువగా ఫ్రిడ్జ్‌లోని నీళ్లు తాగడం వలన గొంతు సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది
  • కూల్ వాటర్ మన దాహాన్ని తీర్చవచ్చు కానీ.. దీని వలన శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది. అందువలన సమ్మర్‌లో కూల్ వాటర్ తాగడం అంత మంచిది కాదు.
  • కూలింగ్ వాటర్ వల్ల వాత, కఫ, పిత్త దోషలు ఏర్పడి జీర్ణద్రవాల పనితీరు మందగిస్తుంది.
  • ఎక్కువగా చల్లని నీరు తాగడం వలన రక్త నాళాలల పనితీరు మందగిస్తోంది.
  • చల్లని నీటి వల్ల గొంతు నొప్పులతోపాటు ముక్కు దిబ్బడ సమస్యలు కూడా తలెత్తుతాయి.


Next Story

Most Viewed