బీపీ, షుగర్‌లలో హైదరాబాదీలే టాప్! ఆ స్క్రీనింగ్‌లో అధికారులకు షాక్​

by Disha Web Desk 19 |
బీపీ, షుగర్‌లలో హైదరాబాదీలే టాప్! ఆ స్క్రీనింగ్‌లో అధికారులకు షాక్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాదీలను బీపీ, షుగర్​వ్యాధులు వేధిస్తున్నాయి. 46,909 మందికి చక్కెర వ్యాధి కన్ఫామ్​కాగా, 1,38,218 మంది అనుమానితుల శాంపిల్స్​ టెస్టింగ్ ప్రాసెస్‌లో ఉన్నాయి. వీరిలో 99 శాతం మందికి వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం ఉన్నదని స్వయంగా డాక్టర్లు చెబుతున్నారు. దీంతో పాటు హైదరాబాద్‌లోని 1,56,361 మందిలో హైపర్​ టెన్షన్​ వ్యాధిని గుర్తించారు. మానసిక ఒత్తిడి, జీవన శైలీలో మార్పులే ప్రధాన కారణంగా డాక్టర్లు పేర్కొంటున్నారు. ఆ తర్వాత స్థానంలో ఖమ్మం జిల్లాలో 37,658 మందికి షుగర్​వ్యాధి ఉన్నట్లు గుర్తించగా, సంగారెడ్డిలో 72, 208 మందికి హైపర్​ టెన్షన్​ అధికంగా ఉన్నట్లు తేల్చారు.

79 శాతం మందికి స్క్రీనింగ్..

రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 3కోట్ల 76 లక్షల 26 వేల 469 మంది ఉండగా, కోటి 37 లక్షల 36,794 మందికి ఎన్‌సీడీ(నాన్​కమ్యునికేబుల్​డీసీజెస్) స్క్రీనింగ్​చేయాలని వైద్యశాఖ లక్ష్యం పెట్టుకున్నది. వీరిలో 1,08,41,495 మందికి ఎన్​సీడీ స్క్రీనింగ్​నిర్వహించగా, 5,94,863 మందికి షుగర్,​12,95,146 మందిలో హైపర్​టెన్షన్​ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే మరో 21,05,182 మందిలో షుగర్​ ఉన్నట్లు అనుమానం రావడంతో స్థానిక మెడికల్​స్టాఫ్​శాంపిళ్లు సేకరించి ల్యాబ్​ లకు పంపించారు. వీరిలో 90 శాతం మందికి తప్పనిసరిగా షుగర్​ ఉంటుందని ఎన్​సీడీ స్కీనింగ్​నిర్వహించిన డాక్టర్లు పేర్కొంటున్నారు. అలాంటి లక్షణాలు తేలడంతోనే శాంపిళ్లు తీసుకున్నామని స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్రంలో ఇటీవల ఎన్​సీడీ స్క్రీనింగ్​నిర్వహించారు. జిల్లాల వారిగా శాంపిళ్లు సేకరించి టెస్టులు చేశారు. ఫలితాలను చూసి అధికారులు కూడా షాకయ్యారు. గత రెండేళ్లతో పోల్చితే షుగర్​వ్యాధి 6 శాతం పెరుగగా, హైపర్ టెన్షన్​ ఏకంగా 20 శాతం పెరిగింది. జిల్లాల వారీగా డేటాను వైద్యశాఖ ప్రభుత్వానికి అందజేసింది. ఆ డేటా ప్రకారం త్వరలో బీపీ, షుగర్​వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకమైన మందులతో కూడిన కిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వాస్తవానికి గతంలోనే కిట్లు ఇవ్వాలని నిర్ణయించగా, స్పష్టమైన డేటా లేనందున అప్పట్లో ఆ ప్రోగ్రాం పెండింగ్‌లో పడిపోయింది. దీంతో త్వరలో కిట్ల పంపిణీని షురూ చేసేందుకు అధికారులు కసరత్తును ప్రారంభించారు.

షుగర్​, హైపర్​ టెన్షన్​ ఎక్కువున్న జిల్లాలు(పేషెంట్ల సంఖ్య)

జిల్లా షుగర్ హైపర్​టెన్షన్​

హైదరాబాద్ 46,909 1,56,361

ఖమ్మ 37,658 61,656

సంగారెడ్డి 31,685 72,208

వరంగల్​అర్బన్ 30,122 66,514

నల్లగొండ 29,117 38,508

నిజామాబాద్​ 28,284 56,304



Next Story

Most Viewed