హిజాబ్‌పై కోర్టు తీర్పు నిరాశపర్చింది.. కశ్మీర్ మాజీ సీఎంలు

by Disha Web Desk 17 |
హిజాబ్‌పై కోర్టు తీర్పు నిరాశపర్చింది.. కశ్మీర్ మాజీ సీఎంలు
X

న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై పిటిషన్లను కొట్టివేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు తమను నిరాశపర్చిందని కశ్మీర్ ప్రముఖ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తి పేర్కొన్నారు. కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై కర్ణాటక రాష్ట్రం విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ హైకోర్టు చెప్పిన తీర్పు నిరాశాజనకంగా ఉందని అభిప్రాయపడ్డారు. మనం ఒకవైపు మహిళా సాధికారత గురించి మాట్లాడతాం, కానీ హిజాబ్ ధరించడం అనే ఒక సాధారణ ఎంపిక హక్కును కూడా తోసిపుచ్చుతాం. హిజాబ్ మతానికి సంబంధించింది కాదు. అది ఎంపిక చేసుకునే స్వాతంత్రమని కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా చెప్పారు. హిజాబ్ గురించి మీరు ఏమైనా భావించండి. అది వస్త్రధారణకు చెందిన అంశం కాదు. అది మహిళలు తాము ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే హక్కు. హైకోర్టు ఈ ప్రాథమిక హక్కును ఎత్తిపట్టకపోవడం పరిహాస్పదంగా ఉందని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed