సీఎం కేసీఆర్‌కు వైద్యారోగ్యశాఖ అధికారుల ఝలక్..!

by Disha Web Desk |
సీఎం కేసీఆర్‌కు వైద్యారోగ్యశాఖ అధికారుల ఝలక్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యారోగ్యశాఖలోని ఖాళీ పోస్టులన్నీ ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానంలోనే భర్తీ చేసేలా కనిపిస్తున్నది. ఇక నుంచి రాష్ట్రంలో కాంట్రాక్ట్​,అవుట్ సోర్సింగ్​ విధానాలు ఎట్టి పరిస్థితుల్లోఉండవని స్వయంగా సీఎం కేసీఆర్​అసెంబ్లీలో ప్రకటించారు. కానీ మళ్లీ పాత సీన్​రిపీట్​అవుతుంది. హెల్త్​ డిపార్ట్ మెంట్‌లోని ఖాళీ సీట్లను నింపేందుకు కాంట్రాక్ట్​ విధానంలో నోటిఫికేషన్లు ఇస్తున్నారు. రెగ్యులర్​రిక్రూట్​మెంట్​కంటే కాంట్రాక్ట్​పోస్టులకే సర్కార్ మొగ్గు చూపుతున్నది. గాంధీ ఆసుపత్రిలో సివిల్​అసిస్టెంట్​సర్జన్లు, అసిస్టెంట్​ప్రొఫెసర్లను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ ఇచ్చారు. 135 పోస్టులను ఇదే విధానంలో భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. వీటిలో జనరల్​మెడిసిన్​అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టులు 20, జనరల్​సర్జరీ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ 20, అసిస్టెంట్​ ప్రొఫెసర్​ 20, అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పీడియాట్రిక్స్​ 20, అనస్థీషియా కు 20, మరో 20 సివిల్​అసిస్టెంట్​ సర్జన్లు కావాలని నోటిఫికేషన్‌ లో స్పష్టం చేశారు.

ఈ నెల 19వ తేదిన దరఖాస్తులు చేసుకోవాలని, ఏప్రిల్​11వ తేది మెరిట్​లిట్​ తయారు చేసిఎంపికైన వారికి 14వ తేదిన అపాయింట్ మెంట్​ ఆర్డర్లు ఇవ్వనున్నారు. అయితే కేవలం సంవత్సరం కాలం పాటు పనిచేయాలని ఆ తర్వాత గవర్నమెంట్​దే తుది నిర్ణయంగా నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. అసిస్టెంట్​ప్రొఫెసర్లకు ప్రతీ నెల రూ. 1,25,000, సివిల్​ అసిస్టెంట్​సర్జన్లకు రూ. 52 వేలు చొప్పున వేతనాలు ఇవ్వనున్నారు.

రెగ్యులర్​ పక్కకు....

సీఎం హామీ ఇచ్చినప్పటికీ వైద్యారోగ్యశాఖలోని ఖాళీలు కాంట్రాక్ట్​ విధానంలో భర్తీ చేయడంపై డాక్టర్లు మండిపడుతున్నారు. కొందరు ఆఫీసర్లకు సీఎం మాట అంటే లెక్క లేకుండా పోయిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తుంటే, మళ్లీ కాంట్రాక్ట్​ విధానంలో పోస్టులు భర్తీ చేయడమేమిటనీ ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు కాంట్రాక్ట్​ విధానంలోనే పనిచేసి ఆలసిపోయామని, వయస్సు మీరిపోతున్నా రెగ్యులర్​రిక్రూట్​మెంట్‌లు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఈ లెక్కన ఉద్యోగాల భర్తీపై ఈ సారి కూడా ఊహజనితమైన మాటలతో ప్రభుత్వం పబ్బం గడిపేలా ఉన్నదని వైద్యారోగ్యశాఖ ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి.



Next Story

Most Viewed