Harshvardhan Kapoor| Sonam Kapoor: దయచేసి నా సోదరిని వేధించొద్దు.. హీరో రిక్వెస్ట్

by samatah |
Harshvardhan Kapoor| Sonam Kapoor: దయచేసి నా సోదరిని వేధించొద్దు.. హీరో రిక్వెస్ట్
X

Harshvardhan Kapoor| Sonam Kapoor

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ గర్భం దాల్చినప్పటి నుంచి కుంటుంబ సభ్యులు, అభిమానులు సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ సంతోషకరమైన వార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన తర్వాత ఇందుకు సంబంధించిన ప్రశ్నలతో కొందరు విసిగిస్తున్నారని ఆమె సోదరుడు హర్షవర్ధన్ కపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. 'ప్రతి ఒక్కరూ ఆ ఆనందాన్ని పంచుకోవాలని కోరుకుంటారు. అయితే దీన్ని కుంటుంబ సభ్యులకు లేదా సన్నిహితుల మధ్యే గోప్యంగా ఉంచాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన గురించిన పర్సనల్ విషయాలు, ఆనంద క్షణాలను అందరితో పంచుకున్నప్పుడూ గౌరవిస్తారో లేదో ఆలోచించాలి. ఇలాంటి పవిత్రమైన విషయంపై అనవసరమైన చర్చలు చేయడం, వివరాలు అడగటం ఎంతమాత్రం సబబు కాదు. ప్రస్తుతం మా కుంటుంబానికి, సోనమ్‌కు కాస్త ప్రైవసీ ఇవ్వండి' అని రిక్వెస్ట్ చేశాడు.

Next Story

Most Viewed