పాక్ జట్టును వాళ్లే నాశనం చేశారు.. త్వరలోనే అన్నీ బయటపెడతా : షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

by Harish |
పాక్ జట్టును వాళ్లే నాశనం చేశారు.. త్వరలోనే అన్నీ బయటపెడతా : షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : పాక్ జట్టును ఎవరు నాశనం చేశారో తెలుసునని, టీ20 వరల్డ్ కప్ తర్వాత అన్నీ బయటపెడతానని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్ కప్‌లో పాక్ పేలవ ప్రదర్శనపై విమర్శలు వస్తున్న తరుణంలో అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజాగా ఓ మీడియా చానెల్ ఇంటర్వ్యూకు యువ పేసర్ మహ్మద్ వసీమ్‌తో కలిసి అఫ్రిది పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా పాక్ జట్టులో ఐక్యత లోపించడానికి కారణం ఏంటని అఫ్రిదిని అడిగారు. దానికి అఫ్రిది బదులిస్తూ..‘వసీమ్‌కు చాలా విషయాలు తెలుసు. నాకూ తెలుసు. కానీ, మేము ఇప్పుడు మాట్లాడలేం. వరల్డ్ కప్ తర్వాత ఓపెన్‌గా మాట్లాడతా. మా వాళ్లే జట్టులో ఐక్యతను నాశనం చేశారు. ఇప్పుడు నేనేమన్నా మాట్లాడితే మా అల్లుడు షాహిన్ అఫ్రిదికి మద్దతుగా మాట్లాడుతున్నానని అంటారు. నేను అలా కాదు. నా కూతురు, నా కొడుకు, నా అల్లుడు తప్పు చేసినా వాళ్లది తప్పే అంటా.’ అని వ్యాఖ్యానించాడు. అఫ్రిది వ్యాఖ్యలు పాక్ క్రికెట్‌లో చర్చనీయాంశమయ్యాయి.

Next Story