అమృత్ పాల్ సింగ్ విడుదల కోసం రంగంలోకి కమలాహారిస్

by Shamantha N |
అమృత్ పాల్ సింగ్ విడుదల కోసం రంగంలోకి కమలాహారిస్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం అమెరికా సిక్కు న్యాయవాది జస్ ప్రీత్ సింగ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ విడుదల కోసం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో భేటీ అయ్యారు. అమృత్ పాల్ సింగ్ ని జైలు నుంచి విడుదల చేసేందుకు సాయం చేయాలని కమలా హారిస్ ని కోరారు. గత రెండు- మూడు నెలల్లో కమలా హారిస్ ను రెండుసార్లు కలిశానని పేర్కొన్నారు. ఇంతేకాకుండా, భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వందమందికి పైగా అమెరికన్ కాంగ్రెస్ సభ్యులతో చర్చలు జరిపేందుకు రెడీ అయినట్లు తెలిపారు. అమృత్ పాల్ కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేశానని.. అమృతపాల్ సింగ్ నిర్బంధం "అన్యాయం" అని జస్‌ప్రీత్ సింగ్ చెప్పారు. అమృత్ పాల్ సింగ్ ని పంజాబ్ పోలీసులు గతేడాది ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని డిబ్రూగఢ్‌ జైల్లో ఉన్నారు. ఇకపోతే, పంజాబ్ లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి అమృత్ పాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు.

Next Story