హరీష్ శంకర్‌కు హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ సినిమా లేనట్లే!

by Disha Web |
హరీష్ శంకర్‌కు హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ సినిమా లేనట్లే!
X

దిశ,సినిమా: 'గబ్బర్ సింగ్' డైరెక్టర్ హరీష్ శంకర్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఏడాది క్రితమే 'భవదీయుడు భగత్‌సింగ్' సినిమా ప్రకటించిన ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్.. పక్కా మరో సూపర్ డూపర్ హిట్ అందుకుంటారనే అనుకున్నారు. కానీ పాలిటిక్స్‌లో బిజీగా ఉండటంతో పవన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. అయితే అదే స్క్రిప్ట్‌తో మరో మెగా హీరోతో ప్లాన్ చేద్దామని నిర్మాతలను అడిగినా ఫలితం లేకుండా పోయిందని, దీంతో గందరగోళానికి గురవుతున్నాడని టాక్. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed