టాటా ఎలక్ట్రిక్ కారు అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం!

by Disha Web Desk 17 |
టాటా ఎలక్ట్రిక్ కారు అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన ఈవీ మోడల్ నెక్సాన్ మ్యాక్స్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకోవడంపై కారణాలను శోధించేందుకు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు, రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తునకు ఆదేశాలిచ్చింది. ఈ ఘటన చోటు చేసుకునేందుకు దారితీసిన పరిస్థితులు, నివారణ చర్యలను సూచించాలని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, నావల్ సైన్స్ అండ్ టెక్ లేబోరేటరీలను కోరినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు దేశంలో ఓలా, ఓకినావా సహా పలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే మంటల్లో చిక్కుకున్న సంఘటనలు జరిగాయి. ఈ కంపెనీలతో సైతం మంత్రిత్వ శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టాటా మోటార్స్ కంపెనీ సైతం ఈ ఘటనపై విచారణ మొదలు పెడుతున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం సమగ్రమైన దర్యాప్తును నిర్వహిస్తున్నామని, పూర్తి విచారణ అనంతరం అన్ని వివరాలు వెల్లడించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

గత నాలుగేళ్లలో మొత్తం 30 వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించామని, తమ ఈవీలు కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇది మొదటి ప్రమాదమని కంపెనీ పేర్కొంది. కాగా, టాటా మోటార్స్ కంపెనీ నెక్సాన్ ఈవీని ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసింది. అతిపెద్ద బ్యాటరీ విభాగంతో అధిక పవర్ అందిస్తూనే, ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత 437 కిలోమీటర్లు ప్రయాణించేలా ఈ మోడల్‌ను ప్రారంభించారు.


Next Story

Most Viewed