రైతులకు గుడ్ న్యూస్.. ఆ గడువు పెంపు

by Dishanational2 |
రైతులకు గుడ్ న్యూస్.. ఆ గడువు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్ స్కీమ్ కింద అర్హలైన రైతులకు సంవత్సరానికి రూ. 6000 ఇస్తున్న సంగతి తెలిసిందే. మూడు విడతల్లో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 2000 చొప్పున జమ చేస్తుంది. ఈ క్రమంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులు ఈ-కేవైసీని తప్పనిసరిగా సమర్పించే తుది గడువును మార్చి 31, 2022 నుంచి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బలు పొందుతున్న రైతులు ఆధార్ ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సాధారణంగా ఈ రోజుతో గడువు ముగియాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డెడ్ లైన్ పోడిగించి రైతులకు ఊరట కలిపించింది. అంటే 2 నెలలలు గడువు పెంచింది. టైం ఉందిగా అంటూ లైట్ తీసుకోవద్దని రైతులను హెచ్చరిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓటీపీ {OTP} ధృవీకరణం ద్వారా చేపట్టే ఆధార్ అధారిత ఈ-కేవైసీ ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేసింది. అర్హులైన రైతులు సీఎస్ సీ కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ అథెంటికేషన్ చేపట్టాలని సూచించింది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ కు వెళ్లి తెలుసుకోవచ్చుని వెల్లడించింది. అయితే ఆధార్ ఓటీపీతో ఆ పని కాదు కావున ,ఈ -కేవైనసీని పూర్తి చేసుకోవాలంటే రైతులు తమ ఆధార్ కార్డును తీసుకుని సీఎస్ సీ [కామన్ సర్వీసు సెంటర్ ] లకు వెళ్లాలని సూచించింది. ఏఫ్రిల్ నెలలో వచ్చే 11 విడత పై ఎలాంటి ప్రభావం పడదని. ఎప్పటి లాగానే అన్నదాత అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ప్రభుత్వం తెలిపింది.


Next Story

Most Viewed