గోరంట్ల మాధవ్ వెంట్రుక కూడా జగన్ పీకలేరు

by Disha Web Desk |
గోరంట్ల మాధవ్ వెంట్రుక కూడా జగన్ పీకలేరు
X

దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ ఎంపీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఛోటా మోటా నాయకుల తీరు అసహ్యించుకునేలా ఉంది అని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. సభ్యసమాజం తలదించుకునేలా వైసీపీ నాయకులు నిసిగ్గుగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ మహిళపై లైంగికవేధింపులకు గురిచేస్తున్న న్యూడ్ వీడియో వైరల్ అవుతున్నా.. గోరంట్ల మాధవ్ బుకాయించడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. ? మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో గురువారం బొండా ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుడ్డలు ఊడతీసుకొని ఎవరైనా జిమ్ చేస్తారా? చెప్పడానికి కూడా వీలుకాని విధంగా వ్యవహరించాడు. పూర్తి నగ్నంగా తయారై అచ్చోసిన ఆంబోతులా వ్యవహరించాడు అంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోరంట్ల మాధవ్ లాంటి వ్యక్తుల వెంట్రుక కూడా పీకలేడు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు.

మహిళలను వేధించే వారికి మంత్రి పదవులా?

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసింది తప్పు, అతనిపై చర్యలు తీసుకొండని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చేయగలడా? అని బొండా ఉమా మహేశ్వరరావు నిలదీశారు. గోరంట్ల మాధవ్‌పై ఎన్నికల అఫిడవిట్‌లో సెక్షన్ 376, అత్యాచారం, సెక్షన్ 302, 506 హత్యాయత్నం కేసులున్నాయని గుర్తు చేశారు. వైసీపీ ఎంపీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఛోటా మోటా నాయకులు రెచ్చిపోవడానికి కారణం సీఎం వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు. గతంలో అంబటి రాంబాబు ''సంజన అనే అమ్మాయిని బ్లూ జీన్స్ వేసుకొని గంటరా సంజనా'' అని అన్న వీడియో అందరం చూశాం. అలాంటివాడికి జగన్ మంత్రి పదవి ఇచ్చాడు. అవంతి శ్రీనివాస్ ''అరగంట రా, అరగంటలో పంపించేస్తాను'' అని అమ్మాయితో చెప్పిన ఆడియో కూడా వైరల్ అయింది. జోగి రమేష్ పెడనలో మద్యం సేవించి మహిళా వలంటీర్లను లైంగిక వేధింపులకు గురిచేసినా జగన్ అతనికి మంత్రి పదవి ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ టీడీపీ చేసిన ఆరోపణలు కావు. వారు మాట్లాడినవే. జగన్ రెడ్డి సమాజంలో ఎటువంటి వ్యక్తులకు నాయకత్వ బాధ్యతలు ఇస్తున్నాడో దీన్ని బట్టి తెలుస్తోంది అని బొండా ఉమా మహేశ్వరరావు ధ్వజమెత్తారు.

గోరంట్ల నగ్నంగా వీడియోల ద్వారా బెదిరిస్తుంటే విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నావ్

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. బయటికి వస్తే అచ్చోసిన ఆంబోతుల్లా వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, మందుబాబుల నుండి తప్పించుకొని బయటికి వచ్చిన మహిళలు గోరంట్ల మాధవ్ లాంటి వ్యక్తుల నుండి తప్పించుకోలేకపోతున్నారు. విజయసాయిరెడ్డి విషయానికొస్తే విజయసాయి చేసేవన్నీ అసంఘిక కార్యకలాపాలే. గుండెపోటు అని, లేదు లేదు మర్డర్ అని ఏదైనా చెప్పగలిగే వ్యక్తి విజయసాయి. తోటి పార్లమెంట్ సభ్యుడు ఢిల్లీలో నగ్నంగా అమ్మాయిలను వీడియోల ద్వారా బెదిరిస్తుంటే విజయసాయి.. నువ్వేమి చేస్తున్నావ్? గతంలోనే నీకు 18 నెలలు జైలుశిక్ష పడినా విజయసాయి బుద్ధి మారలేదు. చీడపురుగులాంటి లక్ష్మీపార్వతికి మచ్చ లేని ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్‌ల గురించి మాట్లాడుతోంది. ఇలాంటి పనులు చేసినందుకే ఆనాడు అందరూ కలిసి తన్ని తరిమేసిన విషయం లక్ష్మిపార్వతి గుర్తు చేసుకోవాలి. ఎన్టీరామారావు కుమార్తె ఉమామహేశ్వరి మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూశారు. దేవేందర్ రెడ్డి పేటీఎం కుక్కలతో ట్వీట్లు చేయడం, సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం మానాలి. జగన్ బాబాయిని చంపి మూడు సంవత్సరాలైంది. ఇప్పటికైనా హంతకులను జగన్ పట్టుకోవాలని, గోరంట్ల మాధవ్ పై ఏం చర్యలు తీసుకోబోతున్నారో జగన్ సమాధానం చెప్పాలి అని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed