కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ కోసం Google Pay కొత్త ఫీచర్

by Disha Web Desk 17 |
కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ కోసం Google Pay కొత్త ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. యాప్‌ల ద్వారా UPI చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. పేమెంట్స్ యాప్‌లు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ Google Pay కూడా వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను తెచ్చింది. NFC ఫీచర్ కలిగి ఉన్న వారి కోసం ట్రాన్సక్షన్‌ను సులభం చేయడానికి ట్యాప్-టు-పే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్టోర్‌లు, షాపింగ్‌మాల్‌లలో ఉపయోగించే కార్డ్ మెషీన్‌లలోని POS టెర్మినల్‌కు స్మార్ట్‌ఫోన్‌లను ట్యాప్ చేయడం ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దీని వలన షాపింగ్ మాల్స్, స్టోర్‌లలో క్యూలో ఎక్కువ సేపు నిలబడాల్సిన అవసరం ఉండదని, అలాగే డిజిటల్ చెల్లింపులు సులభంగా ఉంటాయని Google Pay బిజినెస్ హెడ్ సజిత్ శివానందన్ తెలిపారు.

Google Pay ఈ ఫీచర్‌ను ప్రారంభించేందుకు పైన్ ల్యాబ్స్‌తో కలిసి పని చేసింది. వినియోగదారులు, ప్రత్యేకించి కాంటాక్ట్‌లెస్ డిజిటల్ చెల్లింపులను చేయడానికి ఉపయోగపడుతుందని పైన్ ల్యాబ్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కుష్ మెహ్రా చెప్పారు.


Next Story