Google Maps: అతి త్వరలో గూగుల్ సరికొత్త ఫ్యూచర్.. మ్యాప్స్‌లో అవి కూడా..

by Dishafeatures2 |
Google Maps: అతి త్వరలో గూగుల్ సరికొత్త ఫ్యూచర్.. మ్యాప్స్‌లో అవి కూడా..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆధునిక సమాజంలో గూగుల్ లేకపోతే ఒక్క పని కూడా ముందుకు సాగదు. అందులోనూ ఎక్కడికైనా వెళ్లాలంటే దాదాపు ప్రతి ఒక్కరూ గూగుల్ తల్లి సహాయం కోరుతున్నారు. గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత దూర ప్రాంతాలకు వెళ్లడం, తెలియని ప్రదేశాల్లో సైతం గమ్యస్థానానికి చేరుకోవడం సులభతరం అయింది. ఎప్పటికప్పుడు యూజర్లకు మరింత సౌకర్యం అందించేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గూగుల్ తన మ్యాప్స్ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ అందరికీ అర్థమయ్యే రీతిలో తనను తాను రూపుదిద్దుకుంటోంది. అయితే తాజాగా గూగుల్ తాను తీసుకురానున్న సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది.

మరికొన్ని రోజుల్లో భారత్‌లోని టోల్ ఫీజులను కూడా మ్యాప్స్‌లో చూపించనుందట. అంతేకాకుండా ఇండియా, జపాన్, యూఎస్, ఇండోనేషియా దేశాల్లోని దాదాపు 2 వేల రహదారుల్లో టోల్ ఫీజులు చూపించనున్నామని గూగుల్ తన ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా గూగుల్ ఉండే 'అవాయిడ్ టోల్స్' అనే ఆప్షన్‌తో టోల్స్‌ను తప్పించుకుని కూడా ప్రయాణికులు వెళ్లొచ్చని గూగుల్ చెప్పుకొచ్చింది. వాటన్నింటితో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కూడా చూపించనుందని, భవనాల ఔట్‌లైన్స్‌ను మరింత మెరుగు పరిచామని గూగుల్ తన ప్రకటనలో పేర్కొంది.


Next Story