మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వస్తువులు వాడితే అంతే..

by Disha Web |
మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వస్తువులు వాడితే అంతే..
X

దిశ, వెబ్ డెస్క్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒకసారి వాడి పారేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధం విధిస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం 2022 జూలై 1 నుంచి అమల్లోకి రానుందని తెలిపింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలపై నిషేధం అమలవుతుందని తెలిపింది. కాగా ఫిబ్రవరిలో, హర్యానా అర్బన్ లోకల్ బాడీస్ (ULB) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మునిసిపల్ కార్పొరేషన్‌లకు తమ తమ అధికార పరిధిలో ప్లాస్టిక్ వాడకంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే తాజాగా గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ (MCG) సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై చర్య తీసుకున్నట్టు తెలుపుతూ శనివారం ఓ పబ్లిక్ ఆర్డర్ జారీ చేసింది.

అందులో జూలై 1 నుండి, నగరం అంతటా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ అలాగే అమ్మకం నిషేధించబడుతుందని తెలిపింది. అంతేగాకుండా.. నిబంధనను ఉల్లంఘిస్తే రూ.25,000 అధిక జరిమానా విధించబడుతుందని అధికారులు పేర్కొన్నారు. సింగిల్ యూజ్ దాని పరిధిలోకి వచ్చే వస్తువులను కూడా జాబితా చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉల్లంఘనలపై పర్యవేక్షణ, జరిమానాలను అమలు చేయడానికి ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి ఐదుగురు అధికారులను ఏర్పాటు చేసినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. రాబోయే ఏడు వారాల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని MCG జాయింట్ కమిషనర్ విజయపాల్ యాదవ్ అన్నారు.

Next Story

Most Viewed