పట్టాలు తప్పుతున్న బలగం బ్యూటీ.. ఏంటీ ఈ హాట్ షో!

by Disha Web Desk 8 |
పట్టాలు తప్పుతున్న బలగం బ్యూటీ.. ఏంటీ ఈ హాట్ షో!
X

దిశ, సినిమా : గంగోత్రి సినిమాతో బాలనటిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ కావ్యా కళ్యాణ్. ఈ అమ్మడు వల్లంగి పిట్ట అంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తర్వాత బలగం సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ మధ్య ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోజులతో కుర్రకారను మాయచేస్తూనే ఉంటుంది. మోడ్రన్, ట్రెడిషన్‌లుక్‌లో అదరగొడుతుంది. ఎప్పటికప్పుడు తన వయ్యారాలతో వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ మరోసారి తన అందాలతో విందు ఇచ్చింది.

తాజాగా ఈ నటి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తన అందచందాలతో ఈ నటి నెట్టింట రచ్చ చేస్తుంది. ఇవ ఇవి చూసిన నెటిజన్స్ కావ్యా పట్టాలు తప్పుతోంది.. తన హాట్ హాట్ లుక్స్‌తో యూత్‌కు చెమటలు పట్టిస్తుంది అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్యా కళ్యాణ్, ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు నాగచైతన్య అంటే చాలా ఇష్టమని, ఆయనతో అవకాశం వస్తే ఏం ఆలోచించకుండా సినిమా చేసేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా..గౌతమ్ మీనన్, శేఖర్ కమ్ముల, మణిరత్నం ఇష్టమైన అభిమానుల దర్శకులు అంటూ తెలిపింది. ఇక ప్రస్తుతం ఈ నటి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed