చమురు దిగుమతులపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు

by Dishanational2 |
చమురు దిగుమతులపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: చమురు దిగుమతులపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతులు, యూరోప్ దేశాల కన్నా తక్కువగానే ఉన్నాయని అన్నారు. మంగళవారం 2+2 సమావేశంలో అమెరికా విదేశాంగమంత్రితో ఆయన సమావేశమయ్యారు. మీరు రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను పరిశీలిస్తే, యూరప్ కన్నా తక్కువగానే ఉన్నాయి. దేశ శక్తి భద్రతకు అవసరమైన కొంత శక్తిని మనం కొనుగోలు చేయవచ్చు.. కానీ భారత దేశం ఒక నెల కోసం కొంటున్న ఇంధనం యూరోపు దేశాలు ఒక పూటకు కొంటున్న వాటి కన్నా తక్కువే. మీరు దీని గురించి ఆలోచించాలి అని అన్నారు. ఐరాసలో తమ తటస్థ వైఖరి ఉద్దేశ్యం యుద్ధానికి వ్యతిరేకం కాదని చెప్పారు. తాము చర్చలకు, దౌత్యానికి అనుకూలమని స్పష్టం చేశారు. హింసను తక్షణమే ఆపాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. తాము ఈ లక్ష్యాలకు అనేక విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మరోవైపు యూఎస్ సెక్రటరీ అంటోని బ్లింకెన్ మాట్లాడుతూ భారత్ ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థ కొనుగోలు విషయంలో అంక్షల చట్టాన్ని అమలు చేయడంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అన్ని ప్రధాన దేశాలు రష్యా ఆయుధ వ్యవస్థ లావాదేవీలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ ను దృష్టిలో ఉంచుకుని చేయాలి. ఇక భారత్ రష్యాల మధ్య బంధం సుదీర్ఘ కాలం నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా సంవత్సరాల క్రితం, నేను చెప్పినట్లుగా, మేము భారతదేశానికి భాగస్వామిగా ఉండలేకపోతున్నాము. మేము ఇప్పుడు భారతదేశానికి ఎంపిక చేసుకునే భద్రతా భాగస్వామిగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాము' అని అన్నారు.

భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘనలు పరిశీలిస్తున్నాం..

మానవ హక్కులను పరిరక్షించడం వంటి ప్రజాస్వామ్య విలువలకు తాము నిబద్దతతో వ్యవహరిస్తామని బ్లింకెన్ అన్నారు. భారత భాగస్వాములపై ఇలాంటి విషయమై నిరంతరం టచ్ లో ఉన్నట్లు తెలిపారు. కొన్ని తాజాగా జరిగిన ఆందోళనకర సంఘటనలు పర్యవేక్షించినట్లు చెప్పారు. అయితే చర్చలో ఈ ప్రస్తావన అవసరం లేకపోయినా, మానవ హక్కులపై ప్రజాస్వామ్యిక దృష్టితో చూస్తున్నట్లు వెల్లడించారు.

ఉగ్రవాదంపై పాక్ తిరుగులేని చర్యలు తీసుకోవాలి

పెరుగుతున్న ఉగ్రవాదంపై పాకిస్తాన్ తక్షణ, సుస్థిరమైన, తిరుగులేని చర్యలు తీసుకోవాలని భారత్, అమెరికాలు సంయుక్తంగా కోరాయి. 26/11 ముంబై, పఠాన్ కోట్ దాడులకు బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాయి. ఈ మేరకు 2+2 సమావేశంలో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్ నాథ్ సింగ్, జైశంకర్ తో పాటు యూఎస్ సెక్రటరీ అంటోని బ్లింకెన్, రక్షణ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. టెర్రర్ గ్రూపులు, వ్యక్తులపై ఆంక్షలు, హోదాలు, హింసాత్మక ధోరణిని ఎదుర్కోవడంపై పరస్పర సమాచార మార్పిడికి అంగీకారం తెలిపారు. అంతేకాకుండా ఉగ్రవాద ప్రయోజనాల కోసం ఇంటర్నెట్‌ను ఉపయోగించడం, టెర్రరిస్టుల సరిహద్దు కదలికల గురించి నిరంతర సమాచార మార్పిడికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో పాకిస్థాన్‌తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నామని భారత్ పేర్కొంది. అలాంటి వాతవరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పై ఉందని భారత్‌ ఉద్ఘాటించింది. ముంబై దాడులు 14 ఏళ్లు కావస్తున్న పాకిస్తాన్‌లోని బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Next Story