నవాబ్ మాలిక్‌ రాజీనామా చేయాలి: బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్

by Web Desk |
నవాబ్ మాలిక్‌ రాజీనామా చేయాలి: బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్
X

ముంబై: మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తన పదవికి రాజీనామా చేయాలని విపక్ష నేత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. బుధవారం మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలతో ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. మాలిక్‌ను మంత్రివర్గంలో నిలుపుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా ఆయనకు సంఘీభావం తెలపడమేనని ఫడ్నవీస్ అన్నారు. 'ముంబై దాడుల నిందితుడి నుంచి భూములు కొనుగోలు చేయాల్సిన అవసరం ఆయనకు ఏముంది? దావూద్ సోదరితో లావాదేవీలు ఎందుకు చేశారు. దీని తర్వాత ముంబైలో మూడు దాడులు చోటు చేసుకున్నాయి. ముంబై పై దాడికి పాల్పడిన వారికి డబ్బులివ్వడం, ఇలాంటి వారితో వ్యవహరించడం ఖండిస్తున్నాం' అని చెప్పారు. నవాబ్ మాలిక్‌ను నిబంధనల ప్రకారమే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని ఫడ్నవీస్ అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర సంస్థలను వినియోగించుకుంటుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. 'ఇది మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ లాంటిది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక మాఫియా లాగా బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నాయి. వాస్తవం ఎప్పటికీ గెలుస్తుంది. అప్పటివరకు పోరాటం కొనసాగిస్తాం' అని అన్నారు. కాగా, వచ్చే నెల 3 వరకు మాలిక్ ఈడీ ఆధీనంలో ఉండనున్నారు.

Next Story

Most Viewed