ఆ బ్యాంకులో రూ. కోటి మాయం.. మాజీ మేనేజర్, క్లర్కే దొంగలు!

by Dishanational1 |
ఆ బ్యాంకులో రూ. కోటి మాయం.. మాజీ మేనేజర్, క్లర్కే దొంగలు!
X

దిశ, జగిత్యాల టౌన్: ఒకటి రెండు కాదు దాదాపు 40 నుంచి 60 వరకు నకిలీ ఖాతాలు సృష్టించి రుణం పేరుతో రూ. కోటి పదిహేను లక్షలు కాజేసిన ఉదాంతం జగిత్యాల మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్‌ యూబీఐ బ్యాంకులో పని చేసే సుమన్‌ అనే బ్యాంకు మేనేజర్, క్లర్కు రాజేశ్‌ ఈ భారీ మోసానికి పాల్పడ్డారని పోలీసులు చేసిన ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. వీరిద్దరిపై జగిత్యాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

గతంలో పనిచేసిన మేనేజర్ సుమన్ తో పాటు క్లర్క్ రాజేష్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు, రైతులు, మహిళా సంఘాల పేరుపై అకౌంట్స్ తీసి వారికి తెలవకుండా లోన్ తీసుకున్నట్టు సృష్టించి రూ. కోటికి పైగా కాజేసి బదిలీపై వెళ్లారు. ఈ మధ్యనే బదిలీపై కొత్తగా వచ్చిన మేనేజర్ మోతిలాల్‌ బ్యాంక్ లావాదేవీలు పరిశీలించగా బ్యాంక్ లో మోసం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్ఐ అనిల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నారు. మోసానికి పాల్పడ్డ ఇద్దరినీ ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి మోసానికి పాల్పడినవారిని పట్టుకుంటే మరింత మోసం వెలుగు చూసే అవకాశం ఉందని స్థానికులు పోలీసులు పేర్కొంటున్నారు.


Next Story