- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'చాయ్' రుచిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా ?
దిశ, వెబ్‌డెస్క్ : చాయ్ తాగితే మనసుకి కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. ఒత్తిడికి లోనైనప్పుడు చాయ్ తాగుతూ రిలాక్స్ అయితుంటం. స్నేహితులు, బంధువులు ఇంటికి వస్తే చాయ్ ఇచ్చి మర్యాద చేస్తుంటాం. మీటింగ్స్ , బిజినెస్ డీలింగ్స్ ఒక్క కప్ చాయ్‌తోనే స్టార్ట్ చేస్తాం. అలాగే ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం బలపడలంటే చాయ్ కొట్టులోనే సాధ్యమవుతుంది . చాయ్‌లో చాలా రకాలు ఉంటాయి. అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, మిరియాల టీ అంటూ వివిధ రకాల టీలను చూసి చూస్తుంటాం. కానీ ఎప్పుడైనా డౌట్ వచ్చిందా..? 'టీ'లో పాలు విడివిడిగా ఎందుకు కలుపుతారో అని? దీనిపై పెద్ద స్టొరీ ఉంది.
సాధారణంగా ఇంట్లో పాలు మరిగించిన తరువాత టీ పౌడర్ కొంచెం చెక్కరను కలుపడం చూశాం. కానీ కొన్ని ప్లేసులో 'టీ'లో పాలను విడివిడిగా కలుపుతారు. 18వ శతాబ్దం నాటి ఈ ఆచారం బ్రిటన్ నుండి ప్రారంభమైంది. ఇండియాకు వ్యాపార నిమిత్తం వచ్చిన బ్రిటిషర్లు.. వారి అలవాట్లను కూడా ఇక్కడి ప్రజలకు పరిచయం చేశారు. తేయాకు, పాల మిశ్రమంతో 'టీ' చేసుకుని తాగేవారు. ఈ టీ స్టేటస్‌కు సింబల్‌గా ఉండేది. అయితే అప్పట్లో 'టీ' ని కుండల్లో తయారు చేసేవారు. తయారు చేసిన టీని తాగడానికి చైనీస్ తయారు చేసిన బోన్, ఇతర కప్పులను ఉపయోగించే వారు. బోన్ కప్పులు ఖరీదైనవి కావడంతో వాటిని ఉన్నత వర్గాలు మాత్రమే వినియోగించేవారు. మిగతా కప్పులను మధ్య తరగతి కుటుంబాలు వాడినా.. అవి టీ వేడికి పగిలిపోయేవి. వేడి తగలగానే పగిలిపోయే ఆ కప్పులను తరచూ కొనుగోలు చేయాలంటే అందరికీ సాధ్యం కాకపోయేది.
అదే సమయంలో జుగాద్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. జుగాద్ కింద మొదట కప్పులో పాలు పోస్తారు. ఆ తర్వాత పై నుండి కప్పులో తే నీరు పోస్తారు. ఇలా చేయడంతో కప్పులోకి చేరిన పాలు 'టీ' ఉష్ణోగ్రత తగ్గి టీ కప్పు పగలకుండా ఉండేది. రుచిలోనూ మార్పు రావడంతో ఆ సమయంలో టీకి మంచి డిమాండ్ పెరిగి ఖరీదైన పానీయంగా మారింది. ఇదీ టీ పానీయం కథ.