మానవతా దృక్పధంతో టీమ్స్‌ను మూసివేయవద్దు

by Disha Web Desk |
మానవతా దృక్పధంతో టీమ్స్‌ను మూసివేయవద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ సమయంలో ఏర్పాటు చేసిన టీమ్స్ ఆస్పత్రిని మానవతా దృక్పధంతో మూసివేయవద్దంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. వందలాది డాక్టర్ల పోస్ట్‌లు, పారామెడికల్ సిబ్బంది పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం లేదన్నారు. టీమ్స్ మూసివేయడం అంటే ప్రైవేట్ హాస్పిటల్‌ను సపోర్ట్ చేయడమేనని అన్నారు. కొవిడ్ సమయంలో టీమ్స్ వైద్యులు, మెడికల్ సిబ్బంది సేవలతో మనం బయటపడ్డామని, దాదాపు 30 వేల మందికి సేవలందించారని తెలిపారు.

కాంట్రాక్టు సర్వీసులో తీసుకున్న టీమ్స్ సిబ్బందిని, డాక్టర్లను తొలగిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. 1700 మంది నర్సులను ఇలానే అగ్రిమెంట్ టైం అయిపోవడంతో తీసేసినట్లు గుర్తు చేశారు. టీమ్స్‌ను డాక్టర్స్, మెడికల్ సిబ్బందిని కాపాడాలని, అసెంబ్లీలో టీమ్స్ పై పోరాటం చేయండంటూ ఎంఐఎం పార్టీని కోరారు. ఈ విషయం పై కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంకు లేఖ రాసినట్లు తెలిపారు.


Next Story