ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్

by Disha Web |
ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్
X

దిశ, ఏపీ బ్యూరో : ఎట్టకేలకు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు, ఆశావాహులకు సీఎం జగన్ తీపి కబురు చెప్పారు. ఈనెల 11న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు. రెండు రోజులుగా ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన సీఎం జగన్ బుధవారం సాయంత్రం తాడేపల్లి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే నేరుగా రాజ్‌భవన్ వెళ్లారు. అక్కడ గవర్నర్ బీబీ హరిచందన్‌తో మంత్రివర్గ విస్తరణ, రాజీనామా అంశాలపై చర్చించారు. అలాగే ఈనెల 11న జరగబోయే మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఆయనను ఆహ్వానించారని తెలుస్తోంది. ఇకపోతే ఈ నెల 7న కేబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులంతా మూకుమ్మడిగా మంత్రులంతా రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఆ రాజీనామాలను సీఎం జగన్ రాజ్‌భవన్‌కు పంపుతారని వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.


Next Story