ట్రేడ్ లైసెన్సు లేకుండానే వ్యాపారాలు..లక్షల్లో మున్సిపల్ ఆదాయానికి గండి

by Disha Web |
ట్రేడ్ లైసెన్సు లేకుండానే వ్యాపారాలు..లక్షల్లో మున్సిపల్ ఆదాయానికి గండి
X

దిశ, లక్షెట్టిపేట: ట్రేడ్ లైసెన్స్ లేకుండానే కొందరు వ్యాపారాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఏదేని దుకాణం నడపాలంటే తప్పనిసరిగా మున్సిపాలిటీ కార్యాలయం నుంచి నిబంధనల మేరకు ఫీజు చెల్లించి ట్రేడ్ లైసెన్స్ రసీదు పొందాలి. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో కొందరు దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండానే వ్యాపారాలు చేస్తున్నారు. మరికొందరు ఏటా రెన్యువల్ చేసుకోకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీంతో మున్సిపాలిటీకి ఫీజుల రూపంలో రావాలసిన ఆదాయానికి గండి పడుతోంది.

ఆదాయానికి భారీగా గండి..

లక్షెట్టిపేట పట్టణంలో 710 దుకాణాలు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. అందులో 80 మంది వ్యాపారులు మాత్రమే లైసెన్‌లు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. లక్షెట్టిపేట కొత్త మున్సిపాలిటీ‌గా ఏర్పడి మూడేళ్లు అవుతోంది. అప్పటి నుంచి ప్రతి ఏటా మున్సిపల్ అధికారుల అంచనా మేరకు పట్టణం‌లోని దుకాణాలకు లైసెన్సులు జారీ, రెన్యువల్ ద్వారా సుమారు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఆదాయం రావాల్సి ఉంది. కాగా, ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలని మున్సిపల్ అధికారులు, వ్యాపారుల దుకాణాల వద్దకెళ్లి అడుగుతున్నా కొందరు వ్యాపారులు లైసెన్సులు పొందేందుకు మొండికేస్తున్నారు. లైసెన్సులు పొందని, రెన్యువల్ చెల్లించని వారి ద్వారా మున్సిపల్ ఫీజుల రూపంలో లక్షల రూపాయల్లో ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ప్రధాన రోడ్డులో వ్యాపార ,వాణిజ్య దుకాణాలు నిర్వహిస్తూ ఆదాయ పన్ను చెల్లిస్తున్న కొందరు బడా వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ తీసుకునేందుకు, మరి కొందరు రెన్యువల్ చేసుకునేందుకు వెనకాడటం శోచనీయం.

దేనికి ఎంత..

ప్రాంతాన్ని బట్టి దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ ఫీజును వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రోడ్డు‌ను, దుకాణం విస్తీర్ణానికి కొలతలు వేసి పన్నులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు, దుకాణాలు, హోటళ్లకు చదరపు అడుగుకు రూ.6 చొప్పున, ప్రధాన రోడ్డు‌లో ఉన్న వాటికి చదరపు అడుగుకు రూ. 5 చొప్పున, డబుల్ రోడ్డు‌లో దుకాణానికి చదరపు అడుగుకు రూ.4 చొప్పున, సింగిల్ రోడ్డులో దుకాణానికి రూ.3 చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారు. గతంలో ట్రేడ్ లైసెన్స్ తీసుకున్న వ్యాపారులు రెన్యువల్ చేసుకోవడం లేదని తెలుస్తోంది. కొందరు ట్రేడ్ లైసెన్సు లేకుండా వ్యాపారాలు సాగిస్తున్నా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టడంలో తాత్పర్యం చేస్తుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రేడ్ లైసెన్సులు జారీ, రెన్యువల్ ఫీజుల వసూళ్ల పట్ల గట్టి చర్యలు చేపట్టి మున్సిపల్ కి ఆదాయం నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులతో పాటు పాలకవర్గ ప్రజా ప్రతినిధుల పైన ఎంతైనా ఉంది.

చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం: ఆకుల వెంకటేశ్, మున్సిపల్ కమీషనర్, లక్షెట్టిపేట

ట్రేడ్ లైసెన్స్ లు తీసుకోని వ్యాపారుల ఫై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. పట్టణం లో వ్యాపారాలు నిర్వహించే ప్రతి ఒక్కరూ విధిగా ట్రేడ్ లైసెన్స్ లు తీసుకుని సహకరించాలి.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed