ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం.. గ్రూప్ - 2,3,4 సిలబస్ ఇదే!

by Disha Web Desk 2 |
ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం.. గ్రూప్ - 2,3,4 సిలబస్ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గ్రూప్ –1 నుంచి గ్రూప్ –4 వరకు ఉద్యోగాల భర్తీకి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టీఎస్​పీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షలకు మార్కులు, సిలబస్‌ను పూర్తి చేశారు. వాటిన్నింటినీ అప్​గ్రేడ్​చేశారు. ఏండ్ల నుంచి ఈ పోస్టులకు నోటిఫికేషన్లు రాకపోవడంతో వాటన్నింటినీ తిరిగి అప్​డేట్​చేయాల్సి వస్తున్నది. టీఎస్​పీఎస్సీ పరిధిలో ముందుగా 3,576 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో గ్రూప్​–1 పోస్టులు 503 ఉండగా, మిగిలినవన్నీ గ్రూప్​–2 నుంచి గ్రూప్​–4 వరకు ఉన్నాయి.

675 మార్కులతో గ్రూప్​ –2

గ్రూప్​–2 పరీక్షలను 675 మార్కులకు ఖరారు చేశారు. దీనిలో 75 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించారు. పేపర్​–1లో జనరల్​ స్టడీస్​ప్రశ్నలు ఉండగా, 150 మార్కులు, రెండున్నర గంటల సమయంగా ఖరారు చేశారు. పేపర్​–2లో ఇండియా, తెలంగాణ సోషియో, కల్చర్​ హిస్టరీ, ఇండియన్​కానిస్ట్యూషన్​అండ్​పాలిటిక్స్, సోషల్​స్ట్రక్చర్స్, పబ్లిక్​పాలసీ ఇష్యూస్​పై 150 మార్కులు, రెండున్నర గంటల సమయం ఉంటుంది. పేపర్​–3లో ఇండియన్​ ఎకానమీ, ఇష్యూష్​ఆఫ్​చాలెంజ్, తెలంగాణ ఎకానమీ డెవలప్​మెంట్​ఉండగా, 150 మార్కులు, రెండున్నర గంటల సమయం నిర్ధారించారు. పేపర్​–4లో తెలంగాణ రాష్ట్రం, ఉద్యమ ప్రస్థానం, ఐడియా ఆఫ్​తెలంగాణ (1948–1970), మొబిలేషన్​ఫేజ్​ (1971–1990), తెలంగాణ ఫార్మేషన్​ (1991–2014) ప్రశ్నలు ఉంటాయని, 150 మార్కులు, రెండున్నర గంటల సమయంగా ఖరారు చేశారు.

450 మార్కులతో గ్రూప్​ –3

గ్రూప్​–3 పరీక్షను 450 మార్కులతో ఖరారు చేశారు. ఇందులో ఇంటర్వ్యూలు ఉండవు. జనరల్​స్టడీస్‌తో రాత పరీక్ష పేపర్​ –1 ఉండనుంది. దీనికి 150 మార్కులు. పేపర్​–2లో చరిత్ర, రాజకీయ వ్యవస్థ, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం, భారత రాజ్యాంగం, రాజకీయాలపై అవగాహన, సామాజిక అంశాలపై ప్రశ్నలు ఉండనున్నాయి. 150 మార్కులు, రెండున్నర గంటల సమయం నిర్ధారించారు. ఇక పేపర్​–3లో ఆర్థిక వ్యవస్థ, అంశాలు, సవాళ్లు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, మార్పులు తదితర అంశాలుంటాయి. దీనికీ 150 మార్కులు, రెండున్నర గంటల సమయం కేటాయిస్తారు. ఇందులో తెలంగాణ సామాజిక సాంస్క్రతిక చరిత్ర, తెలంగాణ ఆవిర్భావం, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినులు, ముదిగొండ, వేములవాడ చాళుక్యులు, సాంస్కృతిక ఔన్నత్యానికి తోడ్పాటు, ప్రాచీన తెలంగాణలో బౌద్ధవాదం, జైనవాదం, భాషా సాహిత్యాలు, వృద్ధి, కళలు, వాస్తు శాస్త్రం వృద్ధికి సంబంధించిన ప్రశ్నలుంటాయి.

300 మార్కులతో గ్రూప్​ –4

రెండు రాత పరీక్షలతో గ్రూప్ –4 ఎంపిక చేయనున్నారు. దీనికి మొత్తం 300 మార్కులుగా ఖరారు చేశారు. పేపర్​ –1లో వర్తమాన వ్యవహారాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి, సంబంధాలు, సంఘటనలు, జనరల్​ సైన్స్​, పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ, దేశం, తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, భారత రాజ్యాంగం ప్రధాన లక్షణాలు, రాజకీయ వ్యవస్థ, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్క్రతి, వారసత్వం, కళలు, భాషా సాహిత్యాలు, తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఉండనున్నాయి. దీనికి 150 మార్కులు, 150 నిమిషాల సమయం కేటాయించారు. ఇక పేపర్​ –2లో మానసిక సామర్ధ్యాలు, లాజికల్​ రీజనింగ్, కంప్రెహెన్షన్, గ్రంథంలోని ఒక భాగం విశ్లేషణ సామర్థ్యం కోసం వ్యాఖ్యాలు తిరిగి ఏర్పాటు చేయడం, సంఖ్యాగణిత సామర్థ్యాలు ఉంటాయి. దీనికి 150 మార్కులు, 150 నిమిషాల సమయం ఖరారు చేశారు. వీటన్నింటినీ టీఎస్​పీఎస్సీ అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకువస్తున్నది.

Next Story

Most Viewed