భవిష్యత్తులో ఏమవుతారని అడిగిన కలెక్టర్.. మీలాగే కలెక్టరమవుతామని చెప్పిన విద్యార్థులు

by Web Desk |
భవిష్యత్తులో ఏమవుతారని అడిగిన కలెక్టర్.. మీలాగే కలెక్టరమవుతామని చెప్పిన విద్యార్థులు
X

దిశ, చిట్యాల: చిట్యాల మండలంలోని ఆరెగూడెం ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో ఆయన కాసేపు మాట్లాడారు. విద్యార్థులను మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందుతుందా? లేదా? అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. వారానికి గుడ్లు ఎన్నిసార్లు పెడుతున్నారని విద్యార్థులను అడగగా దానికి విద్యార్థులు మూడు సార్లు గుడ్లు పెడుతున్నారని, భోజనం నాణ్యతతో ఉంటుందని చెప్పడంతో భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని అడిగారు దానికి విద్యార్థులు బాగా చదివి మీలాగా కలెక్టర్ అవుతానని, పోలీస్ అవుతానని పలువురు సమాధానం చెప్పారు. దాంతో కలెక్టర్ బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉదయతో మాట్లాడుతూ పాఠశాలలో ఏమైనా మౌలిక వసతులు అవసరం ఉన్నాయా అని అడగడంతో ఆమె పాఠశాలను మరో తరగతి పెంచి 8వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేయాలని, మరో రెండు అదనపు తరగతి గదులను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మనబడి మన ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పాఠశాల అభివృద్ధికి కావలసిన సౌకర్యాల గురించి చర్చించి ప్రపోజల్ పెట్టాలని గ్రామ సర్పంచ్ కు తెలియజేశారు.

అనంతరం గ్రామంలో ప్రభుత్వ నర్సరీని పరిశీలించారు. నర్సరీలో మొక్కలు ఏ విధంగా పెరుగుతున్నాయనే అంశంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొక్కలు బాగా పెరుగుతుండడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని గుండ్రాపల్లిలో నిర్మాణం అవుతున్న జేబీ రియ ఎస్టేట్ వెంచర్ ను ఆయన పరిశీలించారు. జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న వెంచర్ లో డీటీసీపీ నిబంధనలకు అనుగుణంగా వసతుల ఏర్పాటు జరుగుతున్నాయో లేదో తెలుసుకున్నారు. వెంచర్ యజమానులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఆయన పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ట్రైనీ ఐఏఎస్ అధికారి అపూర్వ చౌహన్, ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, తహశీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ బి. లాజర్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed