సింగరేణి నిర్లక్ష్యం వల్లే అడ్రియాల గని ప్రమాదం: పౌర హక్కుల సంఘం నేతలు

by Dishanational1 |
సింగరేణి నిర్లక్ష్యం వల్లే అడ్రియాల గని ప్రమాదం: పౌర హక్కుల సంఘం నేతలు
X

దిశ, రామగిరి: సింగరేణి అధికారుల నిర్లక్ష్యం వల్లనే అడ్రియాల గని ప్రమాదం చోటు చేసుకుందని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం రామగిరి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గని ప్రమాదం జరిగి 4 రోజులు గడిచినా సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రమాద స్థలాన్ని సందర్శించకపోడాన్ని ఖండించారు. 15 రోజుల క్రింద ప్రమాద స్థలంలో రూఫ్ ఫాల్ జరిగిందని, అయిన మళ్లీ అక్కడ పనులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. గనిలో మృతిచెందిన సింగరేణి అధికారులు జయరాజ్, చైతన్య తేజలతో సమానంగా వీటీసీ ట్రైనర్ శ్రీకాంత్ ను గుర్తించి నష్ట పరిహారం అందజేయాలన్నారు. సింగరేణిలో ప్రైవేటీకరణ మొదలైన నాటి నుండి ప్రమాదాల సంఖ్య పెరిగిందని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మృతుల కుటుంబాలను పరామర్శించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ ఎన్. నారాయణ రావు, సహాయ కార్యదర్శి కుమార స్వామి, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, సభ్యులు రాజగోపాల్, సుచరిత, వినోద్, పర్వతాలు, రాజేశం, రవి, వెంకట్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed