BSNLకి కేంద్రం భారీ ప్యాకేజీ

by Disha Web Desk 4 |
Central Cabinet Announces 1.64 Crore for Revival of BSNL
X

న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ కోసం కేంద్ర కేబినెట్ రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ ప్యాకేజీలో భాగంగా కీలకమైన బీఎస్ఎన్ఎల్ సేవలను మెరుగుపరచడం, బ్యాలెన్స్ షీట్‌పై ఒత్తిడిని తగ్గించడం, ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణ ప్రక్రియ చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

4జీ సేవలను అందించేందుకు బీఎస్ఎన్ఎల్‌కు కావాల్సిన స్పెక్ట్రమ్ కేటాయింపులను ప్రభుత్వ నిర్వహిస్తుంది. బ్యాలెన్స్ షీట్‌పై ఒత్తిడి తగ్గించేందుకు రూ. 33,000 కోట్ల బకాయిలను ఈక్విటీగా మార్చనున్నామని, తక్కువ వడ్డీ బాండ్ల జారీ ద్వారా వచ్చే ఆ మొత్తంతో బ్యాంకు రుణాలు చెల్లించనున్నట్టు ఆయన వివరించారు. వీటితో పాటు భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్(బీబీఎన్ఎల్)ను బీఎస్ఎన్ఎల్‌లో విలీనం చేయనున్నట్టు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. బీబీఎన్ఎల్ ఆధ్వర్యంలోని భారత్‌నెట్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ ప్రాజెక్ట్‌లలో ఒకటి.

ఇది కూడా చదవండి: Zomato షాకింగ్ ఆఫర్.. ఒక్క రూపాయికే షేరు


Next Story