క్యాన్సర్ కణాల్ని గుర్తించే 'చీమలు'!

by Dishafeatures2 |
క్యాన్సర్ కణాల్ని గుర్తించే చీమలు!
X

దిశ, ఫీచర్స్ : కుక్కల అసాధారణమైన ఘ్రాణేంద్రియ సామర్థ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నిషేధిత డ్రగ్స్, పేలుడు పదార్థాలు వంటి వాటిని ట్రాక్ చేయడానికి సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. క్యాన్సర్, మలేరియా లేదా COVID-19 వంటి వ్యాధులను పసిగట్టడంలోనూ కుక్కలు తమ సామర్థ్యాన్ని నిరూపించాయి. ఈ క్రమంలోనే చీమలు కూడా క్యాన్సర్ బాధితులను సమర్థవంతంగా ఫైండవుట్ చేస్తాయని ఫ్రాన్స్‌ పరిశోధకుల బృందం తాజాగా వెల్లడించింది. శునకాలకు సమానంగా బయో-డిటెక్షన్ సామర్థ్యాలను కలిగిన చీమలకు క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు శిక్షణ ఇవ్వచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు.

శునకాలు స్వతహాగా వాసనలు పసిగట్టడంలో ది బెస్ట్ కానీ పేలుడు పదార్థాలు, క్యాన్సర్, కొవిడ్ బాధితుల్ని పట్టుకోవాలంటే మాత్రం శిక్షణ తప్పనిసరి. దీంతో కుక్కలకు ప్రత్యామ్నాయంగా ఎలుకలు, తేనెటీగలు, మిడుతలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు మొగ్గుచూపారు పరిశోధకులు. ఈ క్రమంలోనే 'ఫార్మికా ఫుస్కా' అనే చీమల జాతికి శిక్షణ ఇచ్చి సాధ్యాసాధ్యాలను అన్వేషించారు. చీమలు వాటి అస్థిర కర్బన సమ్మేళనాల (VOC) ద్వారా క్యాన్సర్ రకాలను గుర్తించగలవని గత అధ్యయనాలు పేర్కొన్న నేపథ్యంలో క్యాన్సర్ కణాలను గుర్తించడానికి చీమలకు శిక్షణ ఇవ్వచ్చో లేదో తెలుసుకునేందుకు పరిశోధకులు తాజాగా ప్రయత్నించారు.

ఈ మేరకు ప్రాథమికంగా రెండు రకాల రొమ్ము క్యాన్సర్ కణాలపై దృష్టి సారించగా, రెండు విభిన్న VOC ప్రొఫైల్‌లతో ఉన్నాయి. ఈ మేరకు కుక్కలను ఉపయోగించి ఇటీవలి అధ్యయనాల్లో క్యాన్సర్ కణాలను గర్తించినట్లుగానే అంతే కచ్చితత్వంతో క్యాన్సర్ కణాలు, క్యాన్సర్ కాని కణాల మధ్య తేడాను గుర్తించడానికి చీమలకు సమర్థవంతంగా శిక్షణ ఇవ్వగలిగారు. బయో-డిటెక్టర్లను గుర్తించడంలో చీమలు.. కుక్కలతో సమానమైన ప్రతిభను కనబరిచాయి. అంతేకాదు ఇందుకోసం శునకాలకు 6 నుంచి 12 నెలల పాటు శిక్షణ ఇవ్వాల్సి వస్తే, చీమలకు మాత్రం 30 నిమిషాల్లో ట్రైనింగ్ పూర్తి చేయొచ్చు. దీంతో శిక్షణ సమయం, నిర్వహణ ఖర్చు తగ్గుతుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed