వర్క్ డౌన్ చేసిన బిల్డర్లు.. పెరిగిన ధరలపై ఆందోళన

by Dishafeatures2 |
వర్క్ డౌన్ చేసిన బిల్డర్లు.. పెరిగిన ధరలపై ఆందోళన
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : పెరిగిన ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. బిల్డర్లు ఆందోళన చేపట్టారు. సోమవారం తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, సిటీ బిల్డర్స్ అసోసియేషన్, తెలంగాణ రియల్టర్ల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మాణ రంగ పనులను నిలిపివేసి ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. దీంతో నగరంలో నిర్మాణ రంగ పనులు పూర్తిగా నిలిచిపోయినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాయల మోహన్ రావు 'దిశ' ప్రతినిధితో మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో బిల్డర్లు ఆయోమయానికి గురవుతున్నట్లు తెలిపారు.

సోమవారం ఒక్కరోజునే దాదాపు రూ.400 కోట్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయని తెలిపారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణాలను బంద్ చేసినట్లు తెలిపారు. రెండు నెలల కాలంలో స్టీలు, సిమెంట్,ఇతరాత్ర సామాగ్రి ధరలు 50 శాతం పెరిగినట్లు తెలిపారు. ప్రభుత్వం బిల్డర్లను ఆదుకోవాలని కోరారు. బిల్డర్లు ఇంటి నిర్మాణాలను నిలిపివేయడంతో భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూలీలంతా అడ్డాల వద్ద పనుల కోసం వెచి చూడడం కనిపించింది.

Next Story