నీలి రంగు ఎండ్రకాయ ఎప్పుడైనా చూశారా?

by Disha Web Desk 2 |
నీలి రంగు ఎండ్రకాయ ఎప్పుడైనా చూశారా?
X

దిశ, ఫీచర్స్ : సముద్రాలలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు కొన్ని సమయాల్లో ఊహకందని సముద్ర జీవులను కనుగొంటారు. ఇలాంటి సంఘటనే యూఎస్‌లోని పోర్ట్‌ల్యాండ్, మైనేకి చెందిన లార్సన్ అనే మత్స్యకారుడికి ఎదురైంది. ఇంతవరకు ప్రపంచం ఎరుగని నీలిరంగు పీతలను గుర్తించాడు. తోకలతో పొడవాటి శరీరాన్ని కలిగి జీవులు.. సముద్రపు అడుగు భాగంలో పగుళ్లు లేదా బొరియలలో నివసిస్తాయి. కాగా వాటి ఐదు జతల కాళ్లలో మూడింటికి పంజాలు కూడా ఉంటాయి. సాధారణ ఎండ్రకాయలతో పోలిస్తే ఇవి చాలా పెద్దవి కాగా.. జన్యుపరమైన అసాధారణత కారణంగానే బ్లూ కలర్‌లో ఉంటాయని గుర్తించారు పరిశోధకులు. అంతేకాకుండా ప్రోటీన్ క్రస్టాసైనిన్ యొక్క అధిక ఉత్పత్తి కూడా కారణమని తెలిపారు.

దాదాపు 2 మిలియన్‌లో బ్లూ ఎండ్రకాయ ఒకటి

ప్రతి ఏటా ఎండ్రకాయల సంఖ్య విపరీతంగా పెరగడంతో.. మత్స్యకారులు అప్పుడప్పుడు ఇలాంటి అరుదైన సముద్ర జీవులను పట్టుకుంటారు. అందులో ఈ బ్లూ లోబ్‌స్టర్స్ అనేవి దాదాపు రెండు మిలియన్లలో ఒకటి ఉంటాయి. కాగా ఈ బ్లూ కలర్ ఎండ్రకాయలు పోర్ట్‌ల్యాండ్ తీరంలో కనుగొనబడగా.. వాటిని మళ్లీ సముద్రంలోకే వదిలేశాడు మత్స్యకారుడు.

30 మిలియన్‌లో ఎల్లో ఎండ్రకాయ ఒకటి

లోబ్స్టర్ ఇన్‌స్టిట్యూట్ అంచనాల ప్రకారం.. ఎల్లో కలర్‌లో ఉండే ఎండ్రకాయలు సుమారు 30 మిలియన్లలో ఒకటి ఉంటాయి. ఇక గత సంవత్సరం మైనే మత్స్యకారుడు అరుదైన ఎండ్రకాయలను పట్టుకున్న అనంతరం.. దీనిని బిడ్‌ఫోర్డ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ న్యూ ఇంగ్లండ్ యొక్క మెరైన్ సైన్స్ సెంటర్‌కు మార్లే బాబ్ - టెనెంట్స్ హార్బర్ లాబ్‌స్టర్‌ మ్యాన్ విరాళంగా ఇచ్చాడు. ఇక బనానా అని పిలిచే ఈ ఎండ్రకాయల ఎల్లో శరీరం.. ప్రోటీన్లలోని షెల్ పిగ్మెంట్‌లతో బంధించే జన్యు పరివర్తన ఫలితంగా నివేదించబడింది.

Next Story

Most Viewed