'ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. అన్నింటికీ సిద్ధం కండి'

by Disha Web Desk 13 |
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. అన్నింటికీ సిద్ధం కండి
X

దిశ, నారాయణ పేట: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. కార్యకర్తలు అన్నింటికీ సిద్ధంగా ఉండాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, జాతీయ ఉపాధ్యాక్షురాలు డి.కె. అరుణ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులు అధ్యక్షతన నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఆ పార్టీ పదాధికారులు, వివిధ మోర్చా ల పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, కింది స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై అలుపెరగని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడవద్దని చెప్పారు. పార్టీ అండగా ఉండి కార్యకర్తలను కాపాడుకుంటుందనీ భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు చెప్పుకోవడానికి ఏమి లేకనే వరి పోరు అంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం వరి కొనమని ఎప్పుడూ చెప్పలేదన్నారు.


కానీ టీఆర్ఎస్ ప్రాంతీయతను, రైతులపై మొసలి కన్నీరు కారుస్తూ మోసం చేస్తున్నదన్నారు. వారి మోసాలను ఎండగట్టి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పి బీజేపీ గెలుపునకు సహకరించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు నాగురావునామాజి, రతంగ్ పాండురెడ్డి, ప్రదీప్, కొండయ్య, కాంతారావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ వర్ధన్, భాస్కర్, మదన్, నందునామాజి, వెంకట్రాములు, మిర్చి వెంకటయ్య, అరుణ, లక్ష్మీ శ్యామ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed