Yadadri Temple లో మరోసారి ప్రోటోకాల్ వివాదం.. ఈఓపై బీజేపీ ఫైర్..

by Dishafeatures2 |
BJP Fires On Yadadri Temple EO Geetha Reddy Over Protocol
X

దిశ, యాదగిరిగుట్ట: BJP Fires On Yadadri Temple EO Geetha Reddy Over Protocol| యాదాద్రి ఆలయంలో ప్రొటోకాల్ పాటించకపోవడం మరోసారి వివాదానికి దారి తెలిసింది. మంగళవారం యాదాద్రి నుండి ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ప్రారంభం సందర్భంగా యాదగిరిగుట్ట నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితర ముఖ్య నాయకులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చారు. అయితే వీరికి ప్రోటోకాల్ ప్రకారం ఆలయ ఈఓ గీత రెడ్డి లేకపోవడంతో బిజెపి శ్రేణులు భగ్గుమంటున్నారు. గతంలో కూడా గవర్నర్ యాదాద్రి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. అధికార పార్టీల నాయకులకు మాత్రమే ప్రోటోకాల్ పాట్టిస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిని గౌరవించడం ఇదేనా? అని ఆలయ ఈఓ గీతా రెడ్డి వైఖరి పై బీజేపీ శ్రేణులు గరం అయ్యారు.

కేంద్ర మంత్రులు ఆలయానికి వస్తే ఈఓ కనీసం ప్రొటోకాల్ పాటించలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట మంత్రులు వస్తే రాజ మర్యాదలు చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకులు వచ్చే ప్రతిసారీ ఈఓ అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయొద్దని, ప్రతిపక్ష నాయకులు గుడికి రావొద్దా అంటూ మీడియాతో తెలిపారు. గతంలో కూడా చాలా సార్లు ఇలా అవమానించిన విషయంపై స్పందించిన కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి ప్రోటోకాల్ విషయంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అయినప్పటికీ అధికారుల తీరు మారడం లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు వస్తున్నారని తెలిసే ఈరోజు హుండి లెక్కింపు కార్యక్రమం పెట్టారని ఆలయ అధికారులు సైతం చర్చించుకుంటున్నారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా యాదాద్రి ఆలయ ఈవో పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: గాంధీజీకి మోడీకి అదే తేడా.. మంత్రి కేటీఆర్ సెటైర్లు


Next Story

Most Viewed