Bharatha Vajrasana Yoga: భరత వజ్రాసనం.. దాని వల్ల ప్రయోజనాలు

by Disha Web Desk 7 |
Bharatha Vajrasana Yoga Benefits
X

Bharatha Vajrasana Yoga Benefits| ఈ ఆసనంలో మొదటగా బల్ల పరుపు నేలపై మ్యాట్ మీద రిలాక్స్ పొజిషన్‌లో కూర్చోవాలి. తర్వాత వజ్రాసనంలోకి మారాలి. ఇప్పుడు మడిచిన రెండు కాళ్లను పక్కకు జరుపుతూ ఒకే కాలు (కుడి)పై పిరుదులు ఉండేలా చూసుకోవాలి. రెండు పాదాలను పూర్తిగా నేలపై పడుకోబెట్టాలి. ఇప్పడు ఎడమ చేతును కుడి కాలు మోకాలుపై పెట్టాలి. కుడి చేతిని వీపు వెనక భాగం నుంచి తీసుకొస్తూ ఎడమచేయి మోచేతిని పట్టుకోవాలి. ఇలా కాసేపు ఆగిన తర్వాత మళ్లీ కాలు మార్చి చేయాలి. చివరగా పూర్వ స్థితిలోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి.

ప్రయోజనాలేంటి?

* కాళ్ల కండరాల వశ్యతను పెంచుతుంది.

* నడుము నొప్పి నుంచి ఉపశమనం.

* జీర్ణక్రియను ఉత్తేజ పరుస్తుంది.

* మలబద్ధక సమస్యలు తొలగిపోతాయి.

* పొత్తికడుపులో రక్త ప్రసరణ మెరుగవుతుంది.

ఇది కూడా చదవండి: బకాసనం ప్రయోజనాలేంటి?




Next Story

Most Viewed