ప్రధాని వల్లే 'ఆపరేషన్ గంగా' ముందుకు: అనురాగ్ ఠాకూర్

by Disha Web Desk 17 |
ప్రధాని వల్లే ఆపరేషన్ గంగా ముందుకు: అనురాగ్ ఠాకూర్
X

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ చేపట్టిన చర్యల వల్లే ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు సాధ్యమైందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. భారత పౌరులను ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా తరలించడం సాధారణ ప్రక్రియ కాదని తెలిపారు. ప్రధాని మోడీ ఉక్రెయిన్‌ను నుంచి విద్యార్థులను తరలించేందుకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ఆయన మాట్లాడారు. విద్యార్థులను సురక్షితంగా తరలించడానికి కారిడార్లను ఏర్పాటు చేయడం సాధారణమైన ప్రక్రియ కాదు అని అన్నారు. కేంద్ర మంత్రులు కూడా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లి సమన్వయం చేశారని తెలిపారు. విపక్షాలు పీఎం జన్ ధన్ యోజన ను హాస్యాస్పదంగా చేశాయన్నారు. అయితే తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతి నెల 20.5 కోట్లకు పైగా ఆర్థిక సాయం చేసిందని చెప్పారు. కాగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకారం సోమవారం వరకు ఆపరేషన్ గంగా మిషన్ ద్వారా 17,400 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు.



Next Story

Most Viewed