లీటర్‌కు రూ. 2 చొప్పున పాల ధరలు పెంచిన అమూల్!

by Web Desk |
లీటర్‌కు రూ. 2 చొప్పున పాల ధరలు పెంచిన అమూల్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పాల ఉత్పత్తుల కంపెనీ అమూల్ దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి పాల ధరలను లీటర్‌కు రూ. 2 పెంచుతున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు అమూల్ బ్రాండ్ మార్కెటింగ్ సంస్థ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) ప్రకటించింది. అయితే, లీటర్‌కు రూ. 2 మాత్రమే పెంపు ఉంటుందని, ఇది ఎంఆర్‌పీపై 4 శాతమని, సగటు ఆహార ద్రవ్యోల్బణం కంటే తక్కువగానే పెంచినట్టు కంపెనీ పేర్కొంది. 'ఇటీవల ఇంధన ధరలు మొదలుకొని ప్యాకేజింగ్, రవాణా, పశువుల మేత ఖర్చులు అధికంగా ఉన్నాయి. దీనివల్ల పాల ఉత్పత్తి తో పాటు నిర్వహణ వ్యయం భారంగా మారడంతోనే పాల ధరలు పెంచాల్సి వచ్చిందని' జీసీఎంఎంఎఫ్ వివరించింది. ఖర్చుల పెరుగుదలను పరిగణలోకి తీసుకుని పాడి రైతులకు ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచామని, తాము పాలు, పాల ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయంలో 80 శాతం రైతులకు ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.



Next Story

Most Viewed