ఆ విషయాలు అడగొద్దు.. సూటిగా చెప్పిన రష్మిక

by Javid Pasha |
ఆ విషయాలు అడగొద్దు.. సూటిగా చెప్పిన రష్మిక
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా పేరు అందుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందాన వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే సినిమాలతోపాటు సోషల్ మీడియాలోను నిరంతరం యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆమె షేర్‌ చేసే గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలకు అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. ఈక్రమంలోనే తన ఫ్యాన్స్‌‌కు మరింత చేరవయ్యేందుకు తాజాగా సొంత యూ‌ట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. మొదటి వీడియోను కూడా తన చానెల్‌లో అప్‌లోడ్‌ చేసిన నటి.. ఇందులో తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే ట్రావెలింగ్, యాక్టింగ్, డ్యాన్సింగ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చిన బ్యూటీ.. తన ఎక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు మాత్రం అడగొద్దని ముందుగానే చెప్పేయడం విశేషం.


Next Story