నకిలీ నక్సల్స్ ముఠా అరెస్ట్…

by Kalyani |
నకిలీ నక్సల్స్ ముఠా అరెస్ట్…
X

దిశ, నల్గొండ: నల్గొండ ఎస్పీ. చందన దీప్తి మాట్లాడుతూ నకిలీ నక్సల్స్ ముఠా ని అరెస్ట్ చేసినట్లు వివరాలు వెల్లడించారు. తుపాకులు దాచిపెట్టి తప్పించుకుందాం అనుకున్నారు కానీ అడ్డంగా పోలీసులకు దొరికారు. గత నెల 28వ తేదీన గుడిపల్లి మండలంలోని ఘనపురం గ్రామం శివారులో ఉన్న పెద్దమ్మ తల్లి గుడి శుభ్రం చేస్తున్న తోటకూరి వెంకటయ్య కి అనుమానాస్పద రీతిలో ఒక మూలన మూడు తుపాకులు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసును విచారణ చేస్తూ దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఆ గ్రామంలో కొందరు సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం తోటకూరి శేఖర్ మీద అనుమానం వ్యక్తం చేయడంతో అతనిని అంగడిపేట లో పట్టుకొని విచారణ చేయగా అతను గతంలో కూడా అక్రమ ఆయుధాల కేసులో దోషిగా ఉన్నట్లు అలాగే జైలుకు కూడా వెళ్లారు అని జైలులో రమేష్ అనే వ్యక్తి పరిచయం అవగా జైలు నుంచి బయటకు రాగానే తొందరగా స్థిరపడాలని అతనికి తెలిసిన లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ లను కలుపుకొని నకిలీ నక్సల్స్ అవతారం ఎత్తారు.

విశాఖపట్నం లోని జిక్ వీధిలో ఒక బ్యారెల్ గల ఈ తుపాకులు కొనుగోలు చేసారు. అలాగే తుపాకులు ధరించి ధనవంతులు, మైనింగ్ వ్యాపారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, రోడ్డు వెంబడి వచ్చే వాహనాలను టార్గెట్ చేసుకొని దోపిడీ చేయాలని ప్రణాళిక చేసినట్లు ఆమె తెలిపారు. శేఖర్ తుపాకులు తన ఇంట్లో పెడితే ఎవరైనా గుర్తిస్తారు అని వాటిని గుడి వద్ద దాచినట్లు అలాగే ధరించడానికి కూడా పెద్దవిగా ఉన్నాయి అని చిన్న తుపాకులు, పిస్టల్ లాంటివి కొనాలి అని ఒక వ్యక్తికి 50 వేలు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలిసింది అన్నారు. అలాగే వీరి మీద అర్మ్స్ ఆక్ట్ అండర్ సెక్షన్ 25 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు.

ఇంకా దర్యాప్తు కొనసాగితే ఇంకా ఏమైనా విషయాలు తెలిసే అవకాశం ఉంది అని అక్రమ ఆయుధాలను ఎవరు కలిగి ఉన్న వారి మీద చట్ట పరమైన చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్న గుడిపల్లి పోలీస్ సిబ్బంది కి పారితోషికం ఇచ్చి వారిని అభినందించారు. ఈ కేసులో దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో కొండ మల్లె పల్లి సీఐ దనుజయ సమక్షంలో గుడిపల్లి ఎస్సై నర్సింహులు, సిబ్బంది హేము నాయక్, సత్యనారాయణ, హట్టి నాయక్, కొండల్, భాస్కర్, మహేష్, గురువారెడ్డి, లాలూ నాయక్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed