ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది ప్రయాణికులు దుర్మరణం

by Disha Web |
ఘోర బస్సు ప్రమాదం..  20 మంది ప్రయాణికులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో ఘోర ప్రమాదం జరిగింది. సైంజ్‌ లోయలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి 20 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. షయిన్‌షార్ నుంచి సైంజ్ వైపు టూరిస్టులతో వస్తోన్న బస్సు జంగ్లా గ్రామ సమీపంలో లోయలో పడిపోయింది. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యల్లో ఇప్పటివరకు ఆరు మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం జరిగిన ప్రదేశం లోయ కావడంతో బాధితులను వెలికి తీయడం, ఆసుపత్రికి తరలించడం కష్టతరంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed