అక్కడి మహిళలకు మరణ శిక్ష.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

by Dishanational2 |
అక్కడి మహిళలకు మరణ శిక్ష.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇరాన్‌లో ముగ్గురు మహిళలకు అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. వారి భర్తలను చంపిన కేసులో వారికి మరణ శిక్ష విధించినట్లు సమాచారం. అయితే ఇరాన్‌లో ఎక్కువగా చిన్నవయసులోనే అమ్మాయిలకు పెళ్లి చేస్తుంటారు. దీంతో భార్య భర్తల మధ్య మనస్పర్ధలు.. గృహహింసకు గురవుతుంటారు. ఇక ఆ బాధలు భరించలేని చాలా మంది మహిళలు విడాకులు తీసుకుందాం అనుకున్నా వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇరాన్ మహిళలు తమ బాధల నుంచి బయటపడటానికి తమ భర్తలను చంపేస్తున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం వారికి మరణ శిక్ష విధిస్తుంది. ఈ శిక్షలపై ఆందోళన, చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇరాన్ తగ్గడం లేదు. మహిళలకు వ్యతిరేకంగానే అక్కడి చట్టాలున్నాయని మానవహక్కుల కార్యకర్తలు చెపుతున్నారు.


Next Story