బుక్ మై షో, ఐనాక్స్‌లకు షాక్.. సుల్తానాబజార్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు..

by Disha Web Desk 19 |
బుక్ మై షో, ఐనాక్స్‌లకు షాక్.. సుల్తానాబజార్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా థియేటర్ యాజమాన్యం వ్యవహరించడాన్ని సవాల్ చేస్తూ సామాజిక వేత్త విజయ్ గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తానాబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2006 జీవో-47 ప్రకారం 100 శాతం టికెట్లు ఆన్లైన్‌లోనే జరపాలని ఉంది. కానీ ఐనాక్స్ మల్టిప్లెక్స్ యాజమాన్యం 50 శాతం టికెట్స్‌ను ఆన్లైన్ బుకింగ్‌కు అనుమతి ఇచ్చి.. మరో 50 శాతం టికెట్స్‌ను థియేటర్ బుకింగ్ కౌంటర్ వద్ద అమ్మకాలు జరిపారు. దీనిపై విజయ్ గోపాల్ గతేడాది నవంబర్ 11న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. దీనిపై మరోసారి డిసెంబర్ 1న సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో మరోసారి ఈ నెల 16న సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్‌లో మరో ఫిర్యాదు చేయగా.. ఎట్టకేలకు మార్చి 26న బుక్ మై షో, ఐనాక్స్ థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఇదే మొదటి కేసు అని, దీనిపై విచారణ మొదలు పెట్టినట్లు చెప్పారు.

Next Story