జడ్చర్లలో తీరని ఇసుక ఇక్కట్లు..

by Aamani |
జడ్చర్లలో తీరని ఇసుక ఇక్కట్లు..
X

దిశ,జడ్చర్ల : జడ్చర్ల లో ఇసుక ఇక్కట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండాలని, అందుకోసం అతి తక్కువ ధరకే ఇసుక అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. నిబంధనల ప్రకారం నియోజకవర్గంలో ఇసుక లభ్యత ఉన్న కూడా ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో నిర్మాణ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. దీనిపై ప్రభుత్వం స్పందించి చట్ట ప్రకారం ఇసుక తోడు కోవడానికి ఇవ్వాల్సిన అనుమతులపై సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిర్మాణదారులు అంటున్నారు.

అక్రమార్కులకు ఆదాయ వనరుగా అక్రమ ఇసుక దందా..

నియోజకవర్గంలో ఇసుకతో తోడు కోవడానికి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అక్రమ ఇసుక రవాణా దారులకు ఆదాయ వనరుగా మారింది అనుమతులు లేమీ సాకుతో రూ.3000 రూపాయలకు ఒక ట్రాక్టర్ ఉన్న ఇసుక ధర ను అమాంతం 6 నుంచి 8 వేల రూపాయలకు పెంచడంతో గృహనిర్మాణ దారులు హడలెత్తి పోతున్నారు. దీనికి తోడు ఇదే అదునుగా ఫిల్టర్స్ గా మాఫియా రెచ్చిపోతుంది నియోజకవర్గం లో పలుచోట్ల అక్రమంగా ఫిల్టర్ ఇసుక తయారుచేసి సాధారణ ఇసుక కంటే అధిక రేటుకు ఇసుక విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కాగా ఫిల్టర్ ఇసుక ద్వారా గృహ గృహ నిర్మాణాలు చేపడితే ప్రమాదమని తెలిసి కూడా తప్పని పరిస్థితుల్లో ఫిల్టర్స్ ఇసుక కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దిక్కుతోచని స్థితిలో గృహ నిర్మాణదారులు..

భవన నిర్మాణాలకు సాధారణంగా ఏప్రిల్‌, మే, జూన్‌ మంచి సీజన్‌. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహ నిర్మాణదారులకు తక్కువ ధరకే ఇసుక అందించాలనే లక్ష్యంతో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి ఇసుక తోడు కోవడానికి అనుమతులు ఇవ్వకపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. గత నాలుగు రోజుల క్రితమే పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయని మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఇసుక అనుమతులు ఇవ్వడం కుదరదు కాబట్టి ఇసుక కొరతతో గృహ నిర్మాణాలు కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని గృహ నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేలాది మందికి ఉపాధి దూరం..

భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జడ్చర్ల లో వేలాది కార్మికులు పని చేస్తున్నారు. బేల్దారి కూలీలు, కరెంటు, పెయింటింగ్‌, సెంట్రింగ్‌, కాంక్రీట్‌ కార్మికులతోపాటు ఫ్లోరింగ్‌, కబోర్డ్స్‌, కిటికీలు, తలుపు, తదితర వృత్తులు సంబంధించిన వ్యక్తులు ఉపాధి పొందుతుంటారు. ఒక్క జడ్చర్ల లోనేరోజుకు10 వేల మంది కార్మికులు పనిచేస్తుంటారు. దీనికితోడు వ్యవసాయ కూలీలు అనేక మంది పట్టణాలకు వచ్చి బేల్దారి పనుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. వీరందరినీ ప్రస్తుత పరిస్థితి కలవరానికి గురి చేస్తోంది. దీనికి తోడు సిమెంటు, ఐరన్‌ ధరల పెరుగుదలతో నిర్మాణ రంగం సంక్షోభంలోకి వెళ్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిబంధనల ప్రకారం ఇసుక తోడు కోవడానికి అనుమతులు ఇవ్వాలని భవన నిర్మాణ దారులు వాటిపై ఆధారపడిన కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed