జాతీయస్థాయి కథల పోటీలకు ఎంపికైన 8వ తరగతి విద్యార్థిని

by Dishanational1 |
జాతీయస్థాయి కథల పోటీలకు ఎంపికైన 8వ తరగతి విద్యార్థిని
X

దిశ, మోర్తాడ్: ఏర్గట్ల మండలం తడపాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బడిగిరి నిఖిత జాతీయ స్థాయి కథల పోటీలకు ఎంపికయింది. 'వురిమళ్ల పౌండేషన్' ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్ లో రెండు తెలుగు రాష్ట్రాల పాఠశాల విద్యార్థులకు కథల పోటీలు నిర్వహించగా.. ఆరువందలకు పైగా విద్యార్థులు రాసిన కథలు వచ్చాయని, అందులో నుంచి అత్యుత్తమమైన ముప్పై కథలను ఎంపిక చేశారు. ఆ 30 కథలో నిఖిత రాసిన 'సమానత్వం' అనే కథ ఎంపిక అయ్యింది. విద్యార్థినికి నగదుతోపాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రము అందజేస్తారని పాఠశాల తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు. నిఖితను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Next Story

Most Viewed