తెలంగాణలో ఏడేళ్లలో 5591 మంది రైతులు ఆత్మహత్య

by Disha Web Desk |
తెలంగాణలో ఏడేళ్లలో 5591 మంది రైతులు ఆత్మహత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో 2014 నుంచి 2020 సంవత్సరం వరకు 5,591 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం పార్లమెంటులో ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బదులిచ్చారు. అయితే, తెలంగాణ అవతరించిన ఏడాది 898 మంది రైతులు ఆత్మబలిదానాలు చేసుకోగా.. 2015లో 1,358 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతేగాకుండా, 2016లో 632, 2017లో 846, 2018లో 900, 2019లో 491, 2020లో 466 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

అయితే, దీనిపై టీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలతోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ పోస్టులపై నెటిజన్లు స్పందిస్తూ.. ప్రభుత్వ పథకాలతో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గాలని, ఇంకా 466 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.



Next Story