10 పరీక్షల్లో అధికారులకు షాక్.. ఆశ్చర్యపరుస్తున్న చీటింగ్ స్కిల్స్

by Dishafeatures2 |
10 పరీక్షల్లో అధికారులకు షాక్.. ఆశ్చర్యపరుస్తున్న చీటింగ్ స్కిల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి విద్యార్థి జీవితంలో 10 తరగతి పరీక్షలు చాలా కీలకంగా నిలుస్తాయి. పదో తరగతి మన కెరీర్‌కు ప్రథమ మెట్టు వంటిది. అదే విధంగా అధికారులు సైతం పదో తరగతి పరీక్షలంటే మరింత సునిశిత దృష్టితో అందరినీ కనిపెట్టి ఉంచుతారు. ఏ మాత్రం చీటింగ్ చేస్తున్నట్లు తెలిసినా వారిపై చర్యలు తీసుకుంటారు. అందుకనే విద్యార్థులంతా దాదాపు ఎటువంటి పిచ్చిపనులు చేయకుండా పరీక్షలు రాస్తారు. అయితే హర్యానాలో జరిగిన 10 పరీక్షలు మాత్రం అధికారులను షాక్‌కు గురిచేశాయి. ఈ పరీక్షల్లో దాదాపు 457 మంది చీటింగ్ చేస్తూ దొరికిపోయారు. అంతేకాకుండా 11 మంది డీబార్‌కు గురయ్యారు. అయితే ఓ విద్యార్థి స్క్యాడ్‌కు రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయాడు. ఇవన్నీ ఓ ఎత్తైతే ఒక విద్యార్థి దగ్గర నుంచి అధికారులు డమ్మీ గన్నును కూడా స్వాధీనం చేసుకున్నారు. మారో విద్యార్థి అయితే తన ప్యాడ్‌లో ఫోన్ దాచి పెట్టి మరీ కాపీ కొడుతూ దొరికిపోయాడు. దీంతో బోర్డు అధికారులు అనేక మంది పాఠశాలల టీచర్లను, ప్రిన్సిపాల్స్‌ను విధుల నుంచి తొలగించడం జరిగింది.


Next Story

Most Viewed