Health: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే

by Disha Web Desk 3 |
Health: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే
X

దిశ వెబ్ డెస్క్: మనకు వర్క్ ఫ్రంమ్ హోమ్‌ని అలవాటు చేసింది కోవిడ్. కరోనాని కట్టడి చేసేందుకు, వ్యక్తిగత శుభ్రతతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణుల సూచించన మేరకు ఉద్యోగులకు ఇంటి నుండి పనిచేసుకునే వేసులుబాటును కంపెనీలు కల్పించాయి.

అయితే కరోనా మాయమైనా, నేటికి వర్క్ ఫ్రంమ్ హోమ్‌ కల్చర్ మాత్రం కనిపిస్తూనే ఉంది. చాలామంది ఇంట్లోనే ఉండి పని చేసేందుకు మక్కువ చూపుతున్నారు. అలానే కంపెనీలు కూడా వర్క్ ఫ్రంమ్ హోమ్‌ కారణంగా కంపెనీకి లాభాలు ఉండడం చేత ఎందుకు అంగీకరిస్తోంది.అయితే ప్రస్తుతం వర్క్ ఫ్రంమ్ హోమ్‌ ఉద్యోగులు చేజేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు .

ఏ వర్క్ ఫ్రంమ్ హోమ్‌‌ని అయుతే మనం ఇష్టపడుతున్నామో ఆ వర్క్ ఫ్రంమ్ హోమ్‌‌ ఆరోగ్యానికి ముప్పుగా మారింది.వర్క్ ఫ్రంమ్ హోమ్‌‌ ఉద్యోగుల్లో లివర్ సమస్యలు తలెత్తుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. కదలకుండా కూర్చోవడం, అలానే ఆహారపు అలవాట్ల కారణంగా కాలయంలో కొవ్వు పెరిగి గడ్డలుగా మారుతుంది. ఆ గడ్డలే లివర్ సిరోసిస్ వ్యాదికి దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ లివర్ సిరోసిస్ వ్యాధి వేగంగా ప్రబలుతోందని, ప్రతి ఇద్దరి వ్యక్తుల్లో ఒకరికి ఈ లివర్ సిరోసిస్ వ్యాధి వస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు, థైరాయిడ్, షుగర్‌తో బాధపడుతున్న వ్యక్తులకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాధిని బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజు కనీసం ఒక అరగంట అయిన వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.



Next Story

Most Viewed